టాప్‌ బీటెక్‌ విద్యార్థులకు ఫెలోషిప్‌

Education Budget 2018: Fellowships for 1,000 BTech students, 24 new medical colleges announced - Sakshi

సాక్షి,  న్యూఢిల్లీ:  కేంద్ర బడ్జెట్ 2018 లో  ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ విద్యార్థులకు ఒక శుభవార్త అందించారు.  దేశవ్యాప్తంగా డాక్టరేట్‌ చేయాలనుకునే టాప్‌ బీటెక్‌ విద్యార్థులకు ఫెలోషిప్‌ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ప్రధానమంత్రి ఫెలోషిప్ పథకం కింద  వెయ్యివందికి ఈ ఫెలోషిప్‌ను అందిస్తామన్నారు.తద్వారా  ముఖ్యమైన ఐఐటీలో,  ఐఐఎస్‌సీలలో పీహెచ్‌డీ చదివేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి విద్యా బడ్జెట్ కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ రూ .85,010 కోట్లను  కేటాయించారు. ఇందులో రూ .35,010 కోట్లు ఉన్నత విద్యకు, పాఠశాల విద్య కోసం రూ .50,000 కోట్లు నిధులు సమకూర్చనున్నారు.  దీంతోపాటు 24 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు.  మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు కనీసం ఒక వైద్య కళాశాల ఏర్పాటును ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు జైట్లీ వెల్లడించారు. అలాగే ఎస్‌టీల విద్యార్థుల క కోసం ప్రత్యేకంగా ఏకలవ్య స్కూళ్లను స్టార్ట్ చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. స్కూళ్లలో మౌలిక సదుపాయాలను పెంచేందుకు ప్రత్యేక పథకాన్ని మొదలుపెట్టనున్నారు. రైజ్ స్కీమ్ కింద సుమారు లక్ష కోట్లు ఖర్చు చేయనున్నారు. టీచర్లలో నైపుణ్యాన్ని పెంచేందుకు ఇంటిగ్రేటెడ్ బీఈడీ ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.  అంతేకాదు  విద్యా రంగాన్ని  డిజిటల్‌గా మారుస్తామని.. బ్లాక్‌ బోర్డును డిజిటల్‌ బోర్డుగా మారుస్తామని జైట్లీ పేర్కొన్నారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top