ప్రముఖ డేటా సంస్థలో భారీ ఉద్యోగాలు

dunnhumby to hire more people in India in coming months     - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:   యూకే ఆధారిత డేటా డెవలపర్ డన్ హంబీ కంపెనీ  భారతీయులకు గుడ్‌ న్యూస్‌  చెప్పింది. రానున్న నెలల్లో భారతదేశంలో మరింత మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు  మంగళవారం ప్రకటించింది.  ప్రపంచ రిటైల్ వ్యాపారం రంగంలో  భారత్ ప్రకాశవంతమైన ప్రదేశంగా ఉన్నందున ఈ సంస్థ తన గ్లోబల్  వినియోగదారులను పెంచుకుందని డన్‌హంబీ చీఫ్ టెక్నాలజీ అండ్ ప్రొడక్షన్ ఆఫీసర్ డేవిడ్ జాక్ తెలిపారు.  25 శాతం కన్నా ఎక్కువ వృద్ధిని సాధించిందన్నారు. రానున్న నెలల్లో భారతదేశంలో తమ టాలెంట్‌ పూల్‌ను  మరింత పెంచుతామని ఆయన అన్నారు. జనాభా పరిమాణం,  రిటైల్ రంగంలో వేగంగా  వృద్ధి చెందుతున్న భారత్‌ భారీ అవకాశాలను కలిగి ఉందని డేవిడ్‌ జాక్‌ చెప్పారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top