ఈసీ.. ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్. ఆస్తి కొనేటప్పుడు అక్కరకొచ్చే కీలకమైన పత్రం. ఈసీ కోసం దరఖాస్తు చేసేటప్పుడు వివరాలన్నీ స్పష్టంగా రాయాలి.
సాక్షి, హైదరాబాద్: ఈసీ.. ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్. ఆస్తి కొనేటప్పుడు అక్కరకొచ్చే కీలకమైన పత్రం. ఈసీ కోసం దరఖాస్తు చేసేటప్పుడు వివరాలన్నీ స్పష్టంగా రాయాలి. మనం కొనాలనుకున్న ఆస్తి ఎక్కడుంది? దాని సర్వే నంబరు? విస్తీర ్ణం రాయాలి. వ్యవసాయ భూమి అయితే ఎన్ని ఎకరాల్లో ఉంది? ప్లాటు అయితే ఎన్ని గజాల్లో ఉందో రాయాలి. ఆ ఆస్తికి నలువైపులా గల హద్దులను పేర్కొనాలి. అంతేకాకుండా నాలుగువైపులా ఉన్న స్థల యజమానుల పేర్లు కూడా రాయాలి. అప్పుడే ఆస్తిపరంగా, వ్యక్తిపరంగా ఈసీ పత్రాన్ని అందుకోవచ్చు.