రూపాయి నాణెం = రూ.1.11?

Do know Cost of making Re 1 coin is Rs 1.11? - Sakshi

1 రూపాయి నాణెం తయారీ ఖర్చు  రూ.1.11

2 రూపాయల నాణెం ముద్రణ ఖర్చు  రూ.1.28

5 రూపాయల నాణెం ముద్రణ ఖర్చు  రూ.3.69

10 రూపాయల నాణెం ముద్రణ ఖర్చు  రూ.5.54

సాక్షి,ముంబై: రూపాయి నాణేన్ని తయారు చేయడానికి అయ్యే ఖర్చు అక్షరాల రూ.1.11.  అవునా... అని ఆశ్యర్యంగా అనిపించినా ఇదే నిజం. ఆర్‌బీఐ అధికారికంగా అందించిన సమాచారం ప్రకారం ఒక రూపాయి నాణెం తయారీకి అయ్యే ఖర్చు అక్షరాలా రూపాయి పదకొండు పైసలు. అంటే దాని  మార్కెట్‌  వాల్యూ కంటే అధికంగా ఖర్చు అవుతోందన్న మాట.

ఆర్‌టీఐ ద్వారా ఇండియా టుడే అడిగిన ప్రశ్నను  వివిధ  ప్రభుత్వ నాణేల ముద్రణా కార్యాలను పంపించింది రిజర్వ్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా.  అయితే నాణేల ఉత్పత్తి కయ్యే మొత్తం వ‍్యయం వివరాలను అందించేందుకు ఇండియన్  గవర‍్నమెంట్‌ మింట్ (ఐజీఎం)  నిరాకరించింది. సమాచార హక్కు చట్టం 2005, సెక్షన్ 8 (1) (డీ) ప్రకారం  వాణిజ్య రహస్యమని పేర్కొంది.

మింట్‌ అందించిన సమాచారం ప్రకారం గడిచిన రెండు దశాబ్దాలుగా తగ్గుముఖం పట్టిన ఖర్చు ఇటీవలకాలంలో భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరంలో నాణేల తయారీని భారీగా తగ్గించి వేసింది మింట్. 2016-17లో 2201 మిలియన్ల నాణేలను తయారుచేసిన మింట్..2015-16లో 2151 మిలియన్లుగా ఉన్నాయి. వీటిలో రూపాయి నాణేల 903 మిలియన్ల నుంచి 630 మిలియన్లకు తగ్గించింది. హైదరాబాద్‌ మింట్‌  కూడా గత నాలుగు సంవత‍్సరాల గణాంకాల సమాచారాన్ని అందించింది.

ముంబైతోపాటు హైదరాబాద్‌లలో ఉన్న మింట్ కేంద్రాల్లో రూ.10, రూ.5, రూ.2. రూ.1 నాణేలు తయారవుతున్నాయని  మింట్  తెలిపింది‌.  ఖర్చులు పెరిగినప్పటికీ నాణేల తయారీని నిలిపివేసే అవకాశాలు లేవని మింట్ ప్రకటించింది.

అయితే రూపాయి నాణెంతో పోలిస్తే మిగిలిన నాణేల ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంది. రూ. 1.28 ఖర్చుతో రూ. 2 నాణెం తయారవుతుండగా, 5 రూ. నాణేనికి రూ.3.69, 10 రూపాయల నాణేనికి రూ. 5.54 ఖర్చు అవుతోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top