డీహెచ్ఎఫ్ఎల్ ఆదాయం రూ.1,964 కోట్లు | Dewan Housing Finance net rises 17% in Q4 | Sakshi
Sakshi News home page

డీహెచ్ఎఫ్ఎల్ ఆదాయం రూ.1,964 కోట్లు

May 5 2016 2:27 AM | Updated on Sep 3 2017 11:24 PM

డీహెచ్ఎఫ్ఎల్ ఆదాయం రూ.1,964 కోట్లు

డీహెచ్ఎఫ్ఎల్ ఆదాయం రూ.1,964 కోట్లు

దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్(డిహెచ్‌ఎఫ్‌ఎల్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.190 కోట్ల నికర లాభం(స్టాండోలోన్) ఆర్జించింది.

దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్(డిహెచ్‌ఎఫ్‌ఎల్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.190 కోట్ల నికర లాభం(స్టాండోలోన్) ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) నాలుగో త్రైమాసిక కాలంలో సాధించిన నికర లాభం(రూ162 కోట్లు)తో పోల్చితే 17 % వృద్ధి సాధించామని డీహెచ్‌ఎఫ్‌ఎల్ పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.1,581 కోట్ల నుంచి రూ.1,964 కోట్లకు ఎగసిందని వివరించింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే 2014-15లో రూ.642  కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరంలో 17 శాతం వృద్ధితో రూ.749 కోట్లకు పెరిగిందని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement