దేనా బ్యాంక్‌ నష్టాలు రూ.380 కోట్లు | Dena Bank has a loss of Rs 380 crore | Sakshi
Sakshi News home page

దేనా బ్యాంక్‌ నష్టాలు రూ.380 కోట్లు

Feb 15 2018 1:50 AM | Updated on Feb 15 2018 1:50 AM

Dena Bank has a loss of Rs 380 crore - Sakshi

దేనా బ్యాంక్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దేనా బ్యాంక్‌కు  ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌–డిసెంబర్‌ క్వార్టర్లో రూ. 380 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు రూ.35 కోట్ల నికర లాభం సాధించామని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.2,996 కోట్ల నుంచి రూ.2,476 కోట్లకు తగ్గిందని తెలిపింది. స్థూల మొండి బకాయిలు 14.79 శాతం నుంచి 19.56 శాతానికి, నికర మొండి బకాయిలు 9.52 శాతం నుంచి 11.52 శాతానికి పెరిగాయని వివరించింది.

ఫలితంగా మొండి బకాయిలకు కేటాయింపులు రెట్టింపయ్యాయని, రూ.427 కోట్ల నుంచి రూ.1,044 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్‌ షేర్ల జారీ ద్వారా రూ.3,045 కోట్ల సమీకరణకు తమ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని దేనా బ్యాంక్‌ వెల్లడించింది.   ఆర్థిక ఫలితాలు అధ్వానంగా ఉండటంతో బీఎస్‌ఈలో దేనా బ్యాంక్‌ షేర్‌ 2.4 శాతం క్షీణించి రూ.22.35 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయి, రూ.21.90ను తాకింది.    

Advertisement
 
Advertisement
Advertisement