3-6 నెలలకు ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి ? | deerendra kumar advice's for mutual funds investments | Sakshi
Sakshi News home page

3-6 నెలలకు ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి ?

Nov 14 2016 2:41 AM | Updated on Sep 4 2017 8:01 PM

3-6 నెలలకు ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి ?

3-6 నెలలకు ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి ?

మూడు నుంచి ఆరు నెలల కాలానికి మంచి రాబడులు రావాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?

మూడు నుంచి ఆరు నెలల కాలానికి మంచి రాబడులు రావాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?ఈక్విటీ ఫండ్‌‌సలో ఇన్వెస్ట్ చేస్తే, ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే రాబడులపై పన్ను ఉంటుందా? -పవన్, విశాఖ పట్టణం

మూడు నుంచి ఆరు నెలల స్వల్ప కాలానికి మీ డబ్బులను లిక్విడ్ మ్యూచువల్ ఫండ్‌‌సలో గానీ, ఆల్ట్రా షార్ట్‌టర్మ్‌డెట్‌మ్యూచువల్‌ఫండ్‌లో గానీ ఇన్వెస్ట్ చేయవచ్చు. లిక్విడ్ మ్యూచువల్‌ఫండ్స్... ప్రభుత్వ సెక్యూరిటీల్లోనూ, మూడు నెలల వ్యవధి గల డిపాజిట్లలోనూ ఇన్వెస్ట్ చేస్తారుు. మీరు ఎప్పుడైనా ఈ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్‌‌సలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోవచ్చు. ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు. పన్నులు పోగా వీటిపై ఏడాదికి 4-7 శాతం రాబడులు వస్తారుు. ఇక ఆల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్‌‌స91 రోజులకు మించిన ఏడాదిన్నర కాలం కంటే తక్కువ వ్యవధి ఉన్న డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తారుు. ఇక ఈక్విటీ ఫండ్‌‌సవిషయానికొస్తే, ఇన్వెస్ట్ చేసిన ఏడాదిలోపే ఈ ఫండ్‌‌స యూనిట్లను విక్రరుుస్తే మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మూడు నుంచి ఆరు నెలల కాలానికి ఈక్విటీ ఫండ్‌‌సలో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం కాదు. కనీసం ఐదేళ్లకు మించి ఇన్వెస్ట్‌చేయగలిగితేనే ఈక్విటీ ఫండ్‌‌సను ఎంచుకోవాలి.

రూ. 6లక్షల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ) ఈ నెలలోనే మెచ్యూర్ కానున్నది. ఈ డబ్బులను మరో 6-7 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఏ మ్యూచువల్  ఫండ్‌‌సలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? -సుధాకర్, విజయవాడ

 6-7 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఈక్విటీ ఫండ్‌‌సలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. మీరు మ్యూచువల్ ఫండ్‌‌సలో ఇన్వెస్ట్ చేయడం కొత్త అరుుతే, 2 లేదా 3 మంచి బ్యాలెన్‌‌సడ్ ఫండ్‌‌సను ఎంచుకొని వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలి. ఒక వేళ మీరు పన్ను చెల్లిస్తున్నట్లరుుతే, పన్ను ప్రయోజనాల కోసం ఈక్విటీ లింక్డ్ సేవింగ్‌‌స స్కీమ్స్(ఈఎల్‌ఎస్‌ఎస్)ను పరిశీలించవచ్చు. ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. లక్షన్నర వరకూ పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.

నేను కిసాన్ వికాస పత్ర(కేవీపీ)లో రూ.5 లక్షల వరకూ ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. మెచ్యూరిటీ తర్వాత నాకు ఎంత మొత్తం లభిస్తుంది. పన్ను ప్రయోజనాలేమైనా ఉంటాయా? -కిషన్, నిజామాబాద్

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కిసాన్ వికాస పత్రాలపై రాబడి రేటు 7.8 శాతంగా ఉంది. అంటే మీ పెట్టుబడి 110 నెలల్లో (9 సంవత్సరాల 2 నెలల కాలానికి) రెట్టింపు అవుతుంది.  ఇప్పుడు మీరు రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 9 ఏళ్ల 2 నెలల తర్వాత మీకు రూ.10 లక్షలు వస్తారుు. కిసాన్ వికాస పత్రలో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఎలాంటి పన్ను ప్రయోజనాలు లేవు. వీటిపై వచ్చే వడ్డీకి ఇతర వనరుల ద్వారా వచ్చిన ఆదాయం కింద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కేవీపీకు టీడీఎస్(ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) వర్తించదు.

 నేను లాయర్‌గా పనిచేస్తున్నాను. పన్ను ప్రయోజనాల కోసం పీపీఎఫ్(పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్-ప్రజా భవిష్యనిధి), ఈఎల్‌ఎస్‌ఎస్(ఈక్విటీ లింక్డ్ సేవింగ్‌‌స స్కీమ్)ల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంది. దేంట్లో ఎంతెంత ఇన్వెస్ట్ చేయాలి? ఇక ఈఎల్‌ఎస్‌ఎస్ విషయానికొస్తే, ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా?లేకుంటే రెండు స్కీమ్‌లను ఎంచుకోవాలా?   -ఈశ్వర్, హైదరాబాద్

 దీర్ఘకాలంలో ఈక్విటీ ఫండ్‌‌స మంచి రాబడులనిస్తారుు. మంచి రాబడులు పొందాలంటే పీపీఎఫ్ కంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్‌‌సస్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమం. స్వల్పకాలంలో ఇవి కొంత రిస్క్‌అరుునప్పటికీ, ఐదేళ్లకు మించిన కాలానికి ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడులనిస్తారుు. గ్యారంటీడ్ రిటర్న్‌లు ఇస్తాయనే ఆకర్షణ పీపీఎఫ్‌కు ఉంది. అరుుతే ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ రాబడులు ఏమంత ఆకర్షణీయంగా ఉండవని చెప్పవచ్చు. పన్ను ఆదా చేసే ఏవైనా రెండు ఫండ్‌‌సను ఎంచుకొని వాటిల్లో ఇన్వెస్ట్ చేయండి. వీటికి లాక్ ఇన్ పీరియడ్ మూడేళ్లని మర్చిపోకండి.

బ్యాలెన్‌‌సడ్ ఫండ్‌‌సకు సంబంధించి పన్నులు ఎలా ఉంటారుు? వీటిల్లో ఇన్వెస్ట్‌మెంట్స్ ద్వారా పొందే స్వల్పకాలిక, దీర్ఘకాలిక రాబడులపై ఏమైనా పన్నులు చెల్లించాలా ? -రూపస్, బెంగళూరు 

 బ్యాలెన్‌‌సడ్ ఫండ్‌‌స లేదా హైబ్రిడ్  ఫండ్‌‌స... డెట్, ఈక్విటీ కలగలిపిన సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తారుు. వీటిల్లో ఈక్విటీ ఆధారిత ఫండ్‌‌స ఉంటారుు, డెట్ ఆధారిత ఫండ్‌‌సకూడా ఉంటారుు. ఏదైనా ఒక ఫండ్ తన నిధుల్లో కనీసం 65 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే దానిని ఈక్విటీ ఆధారిత బ్యాలెన్‌‌సడ్ ఫండ్ అంటారు. ఏదైనా ఫండ్ ఈక్విటీల్లో 65 శాతం కంటే తక్కువ ఇన్వెస్ట్ చేస్తే దానిని డెట్ ఆధారిత బ్యాలెన్‌‌సడ్ ఫండ్ అంటారు. ఈక్విటీ  ఆధారిత బ్యాలెన్‌‌సడ్ ఫండ్‌‌సలో ఏడాదికి మించిన ఇన్వెస్ట్‌మెంట్స్‌కు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను మినహారుుంపు లభిస్తుంది.

కొనుగోలు చేసిన ఏడాదిలోపే ఈక్విటీ ఆధారిత బ్యాలెన్‌‌స డ్ ఫండ్ యూనిట్లను విక్రరుుస్తే స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను 15 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఇక డెట్ ఓరియంటెడ్ బ్యాలెన్‌‌సడ్ ఫండ్‌‌స విషయానికొస్తే, మూడేళ్లకు  మించి ఈ ఫండ్‌‌సలో ఇన్వెస్ట్‌మెంట్స్ కొనసాగిస్తే, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విధిస్తారు. ఇది ఇండెక్సేషన్‌తో కలిపి అరుుతే 10 శాతం, ఇండెక్సేషన్ ప్రయోజనాలు లేకుంటే 20 శాతంగా ఉంటుంది. వీటిపై స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement