ఈ ఏడాది ఆ టెకీలకు పండగే..

Data Science Roles To See Over One Lakh Job Openings - Sakshi

బెంగళూర్‌ : నూతన టెక్నాలజీల రాకతో ఆయా సాంకేతికతపై పట్టున్న అభ్యర్ధులకు భారీ వేతనాలతో ఉపాధి అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఈ ఏడాది డేటా సైన్స్‌లో లక్షకు పైగా ఉద్యోగాలు రానున్నాయని, ఇది గత ఏడాది కంటే 62 శాతం అధికమని ఓ ఎడ్యుటెక్‌ సంస్థ నివేదిక పేర్కొంది. ఐదేళ్లలోపు అనుభవం కలిగిన వారికే ఈ ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. డేటా సైన్స్‌లో పనిచేసే ప్రొఫెషనల్స్‌, ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్లు, సీనియర్‌ మేనేజర్లతో విస్తృతంగా చర్చించిన మీదట ఎడ్యుటెక్‌ కంపెనీ గ్రేట్‌ లెర్నింగ్‌ ఈ అంచనాకు వచ్చింది. సరైన నైపుణ్యాలు కొరవడిన క్రమంలో 2019లో ఎనలిటిక్స్‌, డేటా విభాగాల్లో 97,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఈ సర్వేలో వెల్లడైంది.

డేటా సైన్స్‌తో కూడిన ఉద్యోగాలకు ప్రధానంగా బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, ఇంధన, ఫార్మా, హెల్త్‌కేర్‌, ఈకామర్స్‌ సహా పలు రంగాల్లో డిమాండ్‌ ఉంది. గత కొన్నేళ్లుగా డిజిటల్‌ ఎకానమీ ఎదుగుదల నేపథ్యంలో కంపెనీలు అమ్మకాలు పెంకచుకునేందుకు, వినియోగదారులను మెరుగ్గా అర్ధం చేసుకునేందుకు డేటా సైన్స్‌ ప్రాధాన్యత పెరిగింది. విస్తృతంగా డేటా అందుబాటులోకి రావడంతో వ్యాపారాభివృద్ధికి డేటా సైన్స్‌ విభాగం కీలకంగా మారిందని గ్రేట్‌లెర్నింగ్‌ కో ఫౌండర్‌ హరి కృష్ణన్‌ నాయర్‌ పేర్కొన్నారు. డేటా సైంటిస్ట్‌, డేటా అనలిస్ట్‌, డేటా ఇంజనీర్‌, బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ డెవలపర్‌ వంటి పోస్టులకు విపరీతమైన డిమాండ్‌ నెలకొందని చెప్పారు.

చదవండి : ఐదేళ్లలో పది లక్షల ఉద్యోగాలు..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top