మరోసారి అదరగొట్టిన డీమార్ట్‌ | D-Mart Operator, Avenue Supermarts, Posts 43percent rise in Q1 net profit | Sakshi
Sakshi News home page

మరోసారి అదరగొట్టిన డీమార్ట్‌

Jul 30 2018 6:03 PM | Updated on Jul 30 2018 6:05 PM

D-Mart Operator, Avenue Supermarts, Posts 43percent rise in Q1 net profit  - Sakshi

సాక్షి, ముంబై: లిస్టింగ్‌లోనే అదరగొట్టి సత్తా చాటిన డీమార్ట్‌ వరుసగా తన హవా చాటుతోంది.  డీమార్ట్ పేరుతో, భారతదేశంలో దుకాణాలు నడుపుతున్న అవెన్యూ  సూపర్ మార్ట్స్ మరోసారి దుమ్ము రేపింది. అద్భుతమైన త్రైమాసిక ఫలితాలతో  దూసుకుపోయింది.  ఫలితాల్లో ఎనలిస్టుల అంచనాలను  సైతం  అధిగమించి  ఇన్వెస్టర్లను అబ్బురపర్చింది.  గత ఏడాదితో పోలిస్తే డీమార్ట్‌ లాభం దాదాపు 100కోట్ల మేర  పుంజుకుంది.

ఈ త్రైమాసికంలో నికరలాభం 43శాతం పెరిగి రూ.250 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలోరూ.174 కోట్ల లాభాన్ని నమోదు చేయడం గమనార్హం.  అలాగే ఈ ఏడాది తొలి క్వార్టర్‌లో కంపెనీ రెవెన్యూ 27శాతం  పుంజుకుని రూ.4559 కోట్ల ఆదాయాన్ని సంస్థ ఆర్జించింది.  గతేడాది ఇది రూ. 3,598గా ఉంది. ఇది సుమారు రూ.251 కోట్ల నెట్ ప్రాఫిట్‌ను సంస్థ ఆర్జించింది. రూ.423 కోట్లుగా నమోదైంది. ఎబిటా మార్జిన్లు  కూడా గత ఏడాది 8.4 శాతం నుంచి కూడా 9.3 శాతానికి పుంజుకున్నాయి.  పన్నులు, తరుగుదల, రుణ విమోచన (ఈబీఐటీడీఏ) కంపెనీలు గత ఏడాది 303 కోట్ల రూపాయల నుంచి  39.4 శాతం  పుంజుకుని రూ .423 కోట్లకు  చేరింది.   కాగా  డీ మార్ట్‌ షేరు  స్వల్ప లాభాలతో ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement