
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో డీమార్ట్ మాతృ సంస్థ అవెన్యూ సూపర్‌మార్ట్స్ ఆదాయం రూ. 16,219 కోట్లుగా (స్టాండెలోన్) నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన రూ. 14,050 కోట్లతో పోలిస్తే 15 శాతం పెరిగింది. త్రైమాసికాలవారీగా క్యూ1లో నమోదైన రూ. 15,932 కోట్లతో పోలిస్తే 1.8 శాతం వృద్ధి చెందినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో కంపెనీ పేర్కొంది.
2025 సెప్టెంబర్ ఆఖరు నాటికి మొత్తం స్టోర్స్ సంఖ్య 432గా ఉంది. స్టాండెలోన్, కన్సాలిడేటెడ్ ఫలితాలను ఆమోదించేందుకు అక్టోబర్ 11న కంపెనీ బోర్డు మసావేశం కానుంది. ఆంధ్రపద్రేశ్, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో డీమార్ట్‌కి కార్యకలాపాలు ఉన్నాయి.