జొమాటో రిప్లైకి నెటిజన్ల ఫిదా | Customer Cancels Zomato Order For Sending Non Hindu Delivery Boy | Sakshi
Sakshi News home page

జొమాటో రిప్లైకి నెటిజన్ల ఫిదా

Jul 31 2019 11:53 AM | Updated on Jul 31 2019 11:58 AM

Customer Cancels Zomato Order For Sending Non Hindu Delivery Boy - Sakshi

 జొమాటో రిప్లైకి నెటిజన్ల ఫిదా

న్యూఢిల్లీ : ఫుడ్‌ డెలివరీకి హిందూయేతర వ్యక్తిని పంపినందుకు ఆర్డర్‌ రద్దు చేసిన కస్టమర్‌కు జొమాటో ఇచ్చిన రిప్లై నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాను ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ను హిందూయేతర వ్యక్తితో డెలివరీ చేయడంతో జొమాటో ఆర్డర్‌ను క్యాన్సిల్‌ చేశానని, వారు డెలివరీ బాయ్‌ను మార్చమని, క్యాన్సిలేషన్‌పై రిఫండ్‌ కూడా ఇవ్వమని చెప్పారని ట్విటర్‌ యూజర్‌ అమిత్‌ శుక్లా ట్వీట్‌ చేశారు. డెలివరీ తీసుకోవాలని తనను ఒత్తిడి చేయరాదని, తనకు రిఫండ్‌ మొత్తం కూడా అవసరం లేదని ఆ యూజర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

శుక్లా ట్వీట్‌కు జొమాటా బదులిస్తూ ఆహారానికి మతం ఉండదని, ఆహారమే మతమని స్పష్టం చేసింది. జొమాటో రిప్లై నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. 2019లోనూ ఇలాంటి వాళ్లున్నారా అని మరో నెటిజన్‌ వ్యాఖ్యానించగా, అద్భుతమైన రిప్లై ఇచ్చారని మరో ట్విటర్‌ యూజర్‌ జొమాటో ప్రతిస్పందనను మెచ్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement