అమెరికన్‌ స్టార్టప్‌ నుంచి.. ఉద్యోగాలు

Clumio said it is hiring individual - Sakshi

అమెరికాకు చెందిన స్టార్టప్‌ కంపెనీ క్లమియో ఇండియాలో తన సెంటర్‌ను ప్రారంభించి, ఉద్యోగాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. క్లమియో కంపెనీ  బెంగళూరులో రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ సెంటర్‌లో సాఫ్ట్‌వేర్‌-యాస్‌-ఏ-సర్వీస్‌(ఎస్‌ఏఏఎస్‌) ఆధారిత డేటా ప్రొటెక‌్షన్‌ సొల్యూషన్స్‌ను అందించనున్నట్లు ఈ కంపెనీ తెలిపింది. ఇండియాలో ఇప్పటికే ఈ కంపెనీలో 34 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఏడాది చివరినాటికి ఉద్యోగుల సంఖ్యను పెంచుకోనున్నట్లు క్లమియో వెల్లడించింది. 
కాగా 2017లో పూజన్‌ కుమార్‌, కౌస్తభ్‌ పాటిల్‌, ఊన్‌ జంగ్‌ అనే ముగ్గురు కలిసి క్యాలిఫోర్నియాలోని శాంటాక్లారా లో క్లమియో స్టార్టప్‌ కంపెనీని స్థాపించారు. ఇప్పటి వరకు ఈ ముగ్గురు కలిసి సుమారు రూ.1,400 కోట్ల నిధులను సమీకరించారు. క్లౌడ్‌ ఆధారిత పలు ఏడబ్ల్యూఎస్‌ సర్వీసుల్ని అందిస్తుంది. ప్రస్తుతమేగాక భవిష్యత్తులోనూ బ్యాక్‌అప్‌ అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. మా కంపెనీ గ్లోబల్‌ టీమ్‌కు సాహయకారిగానేగాక ఫ్రంట్‌ ఎండ్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఓరియెంటేషన్‌లో క్లౌడ్‌ సొల్యూషన్స్‌ను అందిస్తుందని తెలిపింది. దీనిలో ఇంజినీరింగ్‌ టీమ్‌లు ప్రముఖ పాత్ర పోషిస్తాయని తెలిపింది. 
 ఇండియాలో చాలామంది టెక్నాలజీ నైపుణ్యం కలిగి వారు ఉన్నారని క్లుమియో జీఎం అండ్‌ ఇంజనీరింగ్‌ వీపీ సందీప్‌సోని అన్నారు. ఇక్కడ ల్యాండ్‌లైన్‌ కమ్యూనికేషన్స్‌ నుంచి సెల్‌ఫోన్ల విప్లవం ఎలా వచ్చిందో అదేవిధంగా తరువాతి తరం తమ నైపుణ్యంతో సాఫ్ట్‌వేర్‌ను విస్తృతంగా అభివృద్ధి చేస్తుందని సందీప్‌ ఒక ప్రకటనలో అన్నారు. ఈ కంపెనీ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, కస్టమర్‌ సపోర్ట్‌ వంటి విభాగాల్లో కొత్త నియమకాలు చేపట్టనుంది.

Related Tweets
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top