27 ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి రేటు

China GDP growth slows to 6.2 Persant in second quarter  - Sakshi

ఏప్రిల్‌–జూన్‌ మధ్య కేవలం 6.2 శాతం వృద్ధి రేటు

బీజింగ్‌: చైనా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు రెండవ త్రైమాసికం (ఏప్రిల్‌–జూన్‌)లో కేవలం 6.2 శాతంగా నమోదయ్యింది. గడచిన 27 సంవత్సరాల్లో ఒక త్రైమాసికంలో ఇంత తక్కువ జీడీపీ వృద్ది రేటు నమోదుకావడం చైనాలో ఇదే తొలిసారి. అమెరికా వాణిజ్య యుద్ధం, బలహీన గ్లోబల్‌ డిమాడ్‌ వంటి అంశాలు వృద్ధి పడిపోడానికి కారణమని చైనా పేర్కొంది. మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) జీడీపీ రేటు 6.4 శాతంగా నమోదయ్యింది. 2019 మొదటి ఆరు నెలల కాలంలో (జనవరి–జూన్‌) చైనా జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతంగా నమోదయ్యింది. విలువలో ఇది 45.09 ట్రిలియన్‌ యన్స్‌ (దాదాపు 6.56 ట్రిలియన్‌ డాలర్లు) అని చైనా నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ (ఎన్‌బీఎస్‌) పేర్కొంది. 2018లో చైనా వృద్ధి రేటు 6.6 శాతం. 2019లో కేవలం 6 నుంచి 6.5 శాతం శ్రేణిలోనే వృద్ధిరేటు ఉంటుందని చైనా అంచనా వేస్తోంది. ఈ అంచనాలకు అనుగుణంగా తాజా గణాంకాలు వెలువడ్డం గమనార్హం. చైనా జీడీపీలో 54.9 శాతం వెయిటేజ్‌ ఉన్న సేవల రంగం మొదటి ఆరు నెలల కాలంలో 7 శాతం పురోగతిని నమోదుచేసుకుంది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top