మెగా ప్రాజెక్టుల్లోకి పెట్టుబడులు రావాలి | Sakshi
Sakshi News home page

మెగా ప్రాజెక్టుల్లోకి పెట్టుబడులు రావాలి

Published Sat, Feb 20 2016 1:09 AM

మెగా ప్రాజెక్టుల్లోకి పెట్టుబడులు రావాలి

అన్నిరకాలుగా సహకరిస్తాం: నిర్మలా
 మదురై: భారీ ప్రాజెక్టుల్లో ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం ఆశిస్తోందని, ఇందుకు అవసరమైన తోడ్పాటును అందించేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర వాణిజ్య శాఖ  మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. బీహెచ్‌ఈఎల్ లాంటి భారీ ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనలతో ప్రైవేట్ సంస్థలు గానీ వస్తే.. తగు సహాయ, సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.  భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ.. కార్పొరేట్ ఎంగేజ్‌మెంట్ అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కార్మికులను సుశిక్షితులుగా తీర్చిదిద్దేందుకు నైపుణ్యాల అభివృద్ధి పథకం ద్వారా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement