స్పైస్‌జెట్ నుంచి మరో ఆఫర్.. రూ. 2,999కే టికెట్ | CCI approves SpiceJet takeover by Ajay Singh | Sakshi
Sakshi News home page

స్పైస్‌జెట్ నుంచి మరో ఆఫర్.. రూ. 2,999కే టికెట్

Feb 20 2015 3:04 PM | Updated on Oct 2 2018 5:51 PM

స్పైస్‌జెట్ నుంచి మరో ఆఫర్.. రూ. 2,999కే టికెట్ - Sakshi

స్పైస్‌జెట్ నుంచి మరో ఆఫర్.. రూ. 2,999కే టికెట్

విమాన యాన సంస్థ స్పైస్‌జెట్ గురువారం వన్ స్టాప్ సేల్ పేరిట మరో ఆఫర్ ప్రకటించింది.

న్యూఢిల్లీ: విమాన యాన సంస్థ స్పైస్‌జెట్ గురువారం వన్ స్టాప్ సేల్ పేరిట మరో ఆఫర్ ప్రకటించింది. దీని కింద రూ. 2,999కి విమాన టికెట్లను (అన్ని చార్జీలు సహా) అందిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 22 దాకా చేసే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.  ఫిబ్రవరి 22 లోగా వీటిని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం దేశీ రూట్లలో ప్రయాణాలకే ఇది వర్తిస్తుంది.

మరోవైపు, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న స్పైస్‌జెట్‌లో ప్రమోటర్ అజయ్ సింగ్ మెజారిటీ వాటాలు కొనుగోలు చేసే ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కంపెనీలో 58 శాతం పైచిలుకు వాటాలు తీసుకునేందుకు ఆయనకు మార్గం సుగమమైంది.సీసీఐ ఆమోదం లభించిన తర్వాత తొలి దశలో రూ. 400 కోట్ల మేర నిధులు ఇన్వెస్ట్ చేయనున్నట్లు సింగ్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement