నేడు మార్కెట్లకు సెలవు | BSE, NSE, currency, commodity markets shut today | Sakshi
Sakshi News home page

నేడు మార్కెట్లకు సెలవు

Oct 2 2018 9:01 AM | Updated on Oct 2 2018 9:09 AM

BSE, NSE, currency, commodity markets shut today - Sakshi

సాక్షి, ముంబై:  అక్టోబర్‌ 2 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్టాక్‌ మార్కెట్లకు సెలవు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్ఈతో పాటు బులియన్‌, ఫారెక్స్‌, మనీ మార్కెట్లు ఇవాళ పని చేయవు. అక్టోబర్ 1 న సెన్సెక్స్‌  299 పాయింట్లు  పుంజుకుని 36,526.1 వద్ద ముగిసింది. నిఫ్టీ 77.8 పాయింట్లు లాభపడి 11,008.3 వద్ద ముగిసింది.

బాపూజీ 150వ జన్మదినం సందర్భంగా యావద్దేశం  ఘన నివాళులర్పిస్తోంది. ముఖ్యంగా దేశాధ్యక్షుడు రామ్‌నాధ్‌ కోవింద్‌,  ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు మహాత్ముడికి శ్రద్ధాంజలి ఘటించారు.

Advertisement
 
Advertisement
Advertisement