
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ‘ఎక్స్4’ పేరుతో నూతన మోడల్ కారును సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఒక పెట్రోల్, రెండు డీజిల్ వేరియంట్లలో ఈ మోడల్ కార్లు అందుబాటులో ఉన్నాయి.
పెట్రోల్ వేరియంట్ కారు ధర రూ.63.5 లక్షలు.. డీజిల్ వేరియంట్ల ధరల శ్రేణి రూ.60.6 లక్షలు – రూ.65.9 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. చెన్నై ప్లాంట్‌లో వీటి ఉత్పత్తి జరుగుతున్నట్లు తెలియజేసింది. ఎక్స్4 విడుదల ద్వారా స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్ సెగ్మెంట్‌ను భారత్ మార్కెట్లో పరిచయం చేశామని బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్ హాన్స్ క్రిస్టియన్ బార్ట్‌లెస్ పేర్కొన్నారు.