తగ్గిన భెల్‌ నికర లాభం, నష్టాల్లో షేరు

BHEL Q3 profit falls 17percent  to Rs 163 crore, sales down 23percent - Sakshi

17 శాతం తగ్గిన నికర లాభం 

సాక్షి,  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్‌ కంపెనీ భెల్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో 17 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.196 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.162 కోట్లకు తగ్గింది. మొత్తం ఆదాయం రూ.7,564 కోట్ల నుంచి రూ.5,828 కోట్లకు చేరిందని భెల్‌ తెలిపింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలంలో రూ.64 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి నికర లాభం రూ.322 కోట్లుగా ఉంది. 

క్యూ3 ఫలితాలు మార్కెట్‌ను నిరుత్సాహరపచడంతో కంపెనీ షేరు  ఏడాది కనిష్టానికి దిగివచ్చింది.  కీలక సూచీలు లాభాలతో దూసుకుపోతుండగా  మంగళవారం మార్కెట్‌ ముగిసిన తరువాత బీహెచ్‌ఈఎల్‌ కంపెనీ ఫలితాలను విడుదల చేసింది.  దీంతో బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో ఏకంగా 7 శాతం  కుప్పకూలింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top