క్షీణించిన ఎయిర్‌టెల్‌ లాభాలు  | Sakshi
Sakshi News home page

క్షీణించిన ఎయిర్‌టెల్‌ లాభాలు 

Published Tue, Oct 31 2017 4:44 PM

 BHARTI AIRTEL Q2 (Cons) (QoQ):  PAT at `343 down 5.2%



సాక్షి,ముంబై:  దేశీయ  టెలికాం మేజర్‌ భారతి ఎయిర్‌టెల్‌ క్యూ2 ఫలితాల్లో నిరాశపర్చింది.  2017-18 సంవత్సరానికి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో  నికర లాభం  క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ 5.4 శాతం క్షీణించి రూ.343 కోట్లుగా ప్రకటించింది.  గత ఏడాది రూ.1,461కోట్ల లాభంతో పోలిస్తే ఈ ఏడాది సుమారు77శాతం క్షీణతను నమోదు చేసింది.   దేశంలో నెలకొన్న పోటీవాతావరణం సంస్థ లాభాలను భారీగా దెబ్బతీసింది.   

మొత్తం ఆదాయం గత ఏడాది  రూ. 21,958 కోట‍్లతో పోలిస్తే..ఈ క్వార్టర్‌లో  0.8శాతం క్షీణించి రూ. 21, 777కోట్లను సాధించింది.  ఎబిటా మార్జిన్‌ రూ.7922కోట్లుగా ఉంది.  ఐయూసీ చార్జీలకోత తమ ఆదాయంపై ప్రభావాన్ని చూపిందని భారతిఎయిర్‌టెల్‌ ఎండీ  గోపాల్‌ మిట్టల్‌ తెలిపారు. ఇది క్యూ3లో కొనసాగనుందని  ఆయన అంచనా వేశారు. 

Advertisement
Advertisement