
2 శాతం తగ్గిన బజాజ్ ఆటో అమ్మకాలు
బజాజ్ ఆటో అమ్మకాలు మే నెలలో 2 శాతం క్షీణించి 3,45,438 యూనిట్లుగా ఉన్నాయి.
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో అమ్మకాలు మే నెలలో 2 శాతం క్షీణించి 3,45,438 యూని ట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే నెలలో బజాజ్ ఆటో అమ్మకాలు 3,51,436 యూనిట్లుగా నమోదయ్యాయి. అలాగే గతేడాది 3,13,020 యూనిట్లుగా ఉన్న మోటార్‌సైకిల్ అమ్మకాలు ఈ ఏడాది 4 శాతం తగ్గి 3,01,862 యూనిట్లకు చేరాయి. కమర్షియల్ వాహనాల విక్రయాల్లో 13 శాతం వృద్ధి నమోదైంది.
గతేడాది మే నెలలో 38,416 యూనిట్లుగా ఉన్న కమర్షియల్ వాహనాల విక్రయాలు ఈ ఏడాది 43,576 యూనిట్లుగా ఉన్నాయి. వాహన ఎగుమతులు 2 శాతం వృద్ధితో 1,58,824 యూనిట్లకు చేరాయి. గతేడాది మే నెలలో ఎగుమతులు 1,56,179 యూనిట్లుగా ఉన్నాయి.