యాక్సిస్ బ్యాంక్ లాభం 1,916 కోట్లు | Axis Bank: Strong operating performance in Q2 | Sakshi
Sakshi News home page

యాక్సిస్ బ్యాంక్ లాభం 1,916 కోట్లు

Oct 28 2015 1:19 AM | Updated on Sep 3 2017 11:34 AM

యాక్సిస్ బ్యాంక్ లాభం 1,916 కోట్లు

యాక్సిస్ బ్యాంక్ లాభం 1,916 కోట్లు

ప్రైవేట్ రంగంలోని యాక్సిస్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలానికి రూ.1,916 కోట్ల నికర లాభం ఆర్జించింది.

క్యూ2లో 19 శాతం వృద్ధి
ముంబై: ప్రైవేట్ రంగంలోని యాక్సిస్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలానికి రూ.1,916 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక నికర లాభం(రూ.1,611 కోట్లు)తో పోల్చితే 19 శాతం వృద్ధి సాధించామని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. గత క్యూ2లో రూ.10,550 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.12,001 కోట్లకు పెరిగిందని వివరించింది.

బ్యాంక్ అసెట్ క్వాలిటీ క్షీణించింది. స్థూల మొండి బకాయిలు 1.34 శాతం నుంచి 1.38 శాతానికి. నికర మొండి బకాయిలు 0.44 శాతం నుంచి 0.48 శాతానికి పెరిగాయని యాక్సిస్ బ్యాంక్ పేర్కొంది. యాక్సిస్ సెక్యూరటీస్ యూరప్ సంస్థలోని పూర్తి వాటాను యాక్సిస్ క్యాపిటల్ నుంచి రూ.19 కోట్లకు కొనుగోలు చేశామని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఈ బ్యాంక్ షేర్ స్వల్పలాభంతో రూ.521 వద్ద ముగిసింది.

Advertisement
 
Advertisement
Advertisement