నేటి నుంచి యాక్సిస్‌ బ్యాంక్‌ ఓఎఫ్‌ఎస్‌

Axis Bank OCS from today - Sakshi

ఫ్లోర్‌ ధర రూ. 689.52 

న్యూఢిల్లీ:  యాక్సిస్‌ బ్యాంక్‌లో ఉన్న తన వాటాలో కొంత భాగాన్ని  నేటి(మంగళవారం)నుంచి  ప్రభు త్వం విక్రయిస్తోంది. ఎస్‌యూయూటీఐ(ద స్పెసిఫైడ్‌ అండర్‌టేకింగ్‌ ఆఫ్‌ యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా)ద్వారా ఉన్న వాటాలో  3% వరకూ వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) ద్వారా విక్రయించనున్నది. ఇందులో భాగంగా 1.98% వాటాకు సమానమైన 5.07 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ చేస్తోంది.

దీంట్లో 10% వాటా షేర్లను రిటైల్‌ ఇన్వెస్టర్లకు కేటాయించారు. మరో 1.02% వాటాకు సమానమైన 2.63 కోట్ల ఈక్విటీ షేర్లను కూడా విక్రయించే అవకాశముంది.  ఈ షేర్ల విక్రయానికి ఫ్లోర్‌ ధరగా రూ.689.52ను నిర్ణయించారు. ఇది సోమవారం ముగింపు ధర (రూ.710.35) కంటే 3% తక్కువ. వాటా విక్రయం సంస్థాగత ఇన్వెస్టర్లకు నేడు(మంగళవారం), రిటైల్‌ ఇన్వెస్టర్లకు బుధవారం జరుగుతుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top