వచ్చే నెల 7 నుంచి భారత్లో ఐఫోన్ 7 సేల్ | Apple confirms it is not discontinuing iPhone 5s, 6 and 6 Plus in India | Sakshi
Sakshi News home page

వచ్చే నెల 7 నుంచి భారత్లో ఐఫోన్ 7 సేల్

Sep 9 2016 12:38 AM | Updated on Aug 20 2018 2:55 PM

వచ్చే నెల 7 నుంచి భారత్లో ఐఫోన్ 7 సేల్ - Sakshi

వచ్చే నెల 7 నుంచి భారత్లో ఐఫోన్ 7 సేల్

టెక్నాలజీ దిగ్గజ కంపెనీ యాపిల్ తాజాగా మార్కెట్‌లో ఆవిష్కరించిన ‘ఐఫోన్ 7’ స్మార్ట్‌ఫోన్స్ అక్టోబర్ 7 నుంచి భారతీయులకు అందుబాటులోకి రానున్నాయి.

ప్రారంభ ధర రూ.60,000
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజ కంపెనీ యాపిల్ తాజాగా మార్కెట్‌లో ఆవిష్కరించిన ‘ఐఫోన్ 7’ స్మార్ట్‌ఫోన్స్ అక్టోబర్ 7 నుంచి భారతీయులకు అందుబాటులోకి రానున్నాయి. వీటి ప్రారంభ ధర రూ.60,000గా ఉంది. కంపెనీ బుధవారం శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఒక కార్యక్రమంలో  ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ అనే రెండు స్మార్ట్‌ఫోన్స్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, చైనా వంటి దేశాల ప్రజలకు ఈ స్మార్ట్‌ఫోన్స్ సెప్టెంబర్ 16 నుంచే అందుబాటులోకి వస్తున్నాయి. అయితే మనం మరో 3 వారాలు వీటి కోసం ఆగాల్సిందే. ఈ కొత్త ఐఫోన్స్‌లో 32 జీబీ, 128 జీబీ, 256 జీబీ అనే మూడు స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి. ఐఫోన్ 7 స్క్రీన్ పరిమాణం 4.7 అంగుళాలు, ఐఫోన్ 7 ప్లస్ స్క్రీన్ పరిమాణం 5.5 అంగుళాలుగా ఉంది.

ఐఫోన్ 6, 6ప్లస్, 5ఎస్ ఉండవా?
చౌక ధరలకు యాపిల్ పాత మొబైల్ హ్యాండ్‌సెట్స్‌ను కొనుగోలు చేస్తున్న వారు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. వీరికి కంపెనీ పెద్ద షాక్ ఇవ్వనుంది. యాపిల్ తాజాగా ఐఫోన్ 7 ఆవిష్కరణ తర్వాత తన ఇండియా వెబ్‌సైట్ నుంచి ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్, ఐఫోన్ 5ఎస్ మోడళ్లను తొలగిం చింది. అంటే కంపెనీ భారత్‌లో ఐఫోన్ 7 విక్రయాల ప్రారంభం తర్వాత వీటిని తన పోర్ట్‌ఫోలియో నుంచి తొలగించే అవకాశముంది. దీంతో భారతీయ వినియోగదారులకు మొత్తంగా మూడు ఐఫోన్ మోడల్స్ (ఐఫోన్ 7/7ప్లస్, ఐఫోన్ 6ఎస్/6ఎస్ ప్లస్, ఐఫోన్ ఎస్‌ఈ) మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఐఫోన్ 7 ఆవిష్కరణ అనంతరం ఐఫోన్ 5ఎస్‌ను కంపెనీ తన పోర్ట్‌ఫోలియో నుంచి తొలగిస్తుందని అందరం ఊహించాం. కానీ ఐఫోన్ 6 హ్యాండ్‌సెట్స్‌ను కూడా తీసేస్తుండటం ఆశ్చర్యం కలిగించే అంశం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement