లేటెస్ట్‌ ఐఫోన్‌పై డిస్కౌంట్‌ ఆఫర్‌ | Apple brand new iPhone11 is available at lowest price ever in India   | Sakshi
Sakshi News home page

లేటెస్ట్‌ ఐఫోన్‌పై డిస్కౌంట్‌ ఆఫర్‌

Feb 14 2020 5:43 PM | Updated on Feb 14 2020 7:00 PM

Apple brand new iPhone11 is available at lowest price ever in India   - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్‌లైన్‌ రీ టైలర్‌​ అమెజాన్‌ ఆపిల్‌ ఫోన్ల ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. ‘ఆపిల్‌ డేస్‌’ సేల్‌ పేరుతో  ఆపిల్‌ ఉత్పత్తులను తక్కువ ధరలకే అందిస్తోంది. ఈ సేల్‌ ద్వారా వినియోగదారులు తాజా ఐఫోన్ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు,  ఆపిల్ వాచ్, మాక్‌బుక్‌  తదితర వాటిల్లో అద్భుతమైన డీల్స్‌, ఆఫర్లను పొందవచ్చు.  ఈ సేల్‌  17 ఫిబ్రవరి, 2020 వరకు  అందుబాటులో వుంటుంది.  దేశంలో ఐఫోన్‌ 11 సిరీస్‌లో మొదటి  తగ్గింపుగా చెప్పు​కోవచ్చు. 

ప్రధానంగా గత ఏడాది సెప్టెంబరులో లాంచ్‌చేసిన లేటెస్ట్‌ ఆపిల్‌ ఐఫోన్‌ 11 ప్రో ను అతి తక్కువ ధరకే అందిస్తోంది. ఐఫోన్ 11 ప్రో  (64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌) రూ. 93,900కు  అందిస్తోంది. ఐఫోన్ 11 ప్రో మాక్స్ రూ. 1,03,900కు లభిస్తుంది. దీంతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు  కార్డులపై  (డెబిట్, క్రెడిట్ కార్డ్)ల ద్వారా జరిపిన కొనుగోళ్లపై ఐఫోన్ 11 ప్రో పై రూ .6 వేలు,  ఐఫోన్ 11 ప్రో మాక్స్‌లో రూ .7 వేల అదనపు తగ్గింపును పొందవచ్చు. అలాగే మ్యాక్‌బుక్‌ ఎయిర్‌పై రూ. 6వేల రూపాయల డిస్కౌంట్ పొందవచ్చు. ఆపిల్ వాచ్ సిరీస్-4 లో 30 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. మరిన్ని వివరాలు అమెజాన్‌.కామ్‌ లో  లభ్యం.


ఐఫోన్ 11 ప్రో ఫీచర్లు
5.8-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ ఓఎల్‌ఇడి  స్క్రీన్‌
1125 x 2436 పిక్సెల్స్ రిజల్యూషన్
4 జీబీ ర్యామ్‌/ 64 జీబీ/ 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్‌
12+ 12+12  ట్రిపుల్‌ రియర్‌ కెమెరా
12 ఎంపీ సెల్పీ కెమెరా
3065 ఎంఏహెచ్ బ్యాటరీ
సిల్వర్‌, గోల్డ్‌, మిడ్‌నైట్‌ గ్రీన్‌, స్పేస్‌ గ్రే కలర్స్‌లో లభ్యం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement