మార్కెట్‌లోకి ‘అపాచీ ఆర్‌ఆర్‌ 310’ | Apache RR 310' into the market | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లోకి ‘అపాచీ ఆర్‌ఆర్‌ 310’

Dec 7 2017 12:08 AM | Updated on Mar 23 2019 9:28 PM

Apache RR 310' into the market - Sakshi

ధర రూ.2.05 లక్షలు

చెన్నై: ప్రముఖ వాహన కంపెనీ ‘టీవీఎస్‌ మోటార్‌’ తాజాగా సూపర్‌ ప్రీమియం బైక్స్‌ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘అపాచీ ఆర్‌ఆర్‌ 310’ పేరుతో సరికొత్త స్పోర్ట్స్‌ బైక్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.2.05 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). అపాచీ ఆర్‌ఆర్‌ 310లో 4 స్ట్రోక్, 4 వాల్వ్, సింగిల్‌ సిలిండర్, రివర్స్‌ ఇన్‌క్లైన్‌డ్, 312 సీసీ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో ట్విన్‌ ప్రొజెక్టర్‌ హెడ్‌ ల్యాంప్స్, డ్యూయెల్‌ చానల్‌ ఏబీఎస్, డిస్క్‌ బ్రేక్స్, ఫుల్‌ డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ ప్యానెల్, ఎల్‌ఈడీ టెయిల్‌ లైట్, ఎల్‌ఈడీ టర్న్‌ సిగ్నల్స్, హై క్వాలిటీ స్విచ్‌గేర్, అప్‌సైడ్‌ డౌన్‌ ఫ్రంట్‌ ఫోర్క్స్, ఎలక్ట్రానిక్‌ ఫ్యూయెల్‌ ఇంజెకŠష్‌న్, 6–స్పీడ్‌ గేర్‌బాక్స్‌ వంటి పలు ప్రత్యేకతలున్నాయని వివరించింది.

ఎరుపు, నలుపు రంగుల్లో లభ్యంకానున్న ఈ బైక్‌ గరిష్ట వేగం గంటకు 163 కిలోమీటర్లని పేర్కొంది. కాగా ఈ నెల చివరకు ఈ బైక్స్‌ రోడ్లపై పరిగెత్తనున్నాయి. టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ 500 సీసీలోపు విభాగంలో బైక్స్‌ తయారీ కోసం 2013 ఏప్రిల్‌లో బీఎండబ్ల్యూ మోటొరాడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఒప్పందంలో భాగంగా రూపొందిన తొలి బైక్‌ ఇదే.    త్వరలో అపాచీ 160 సీసీలో కొత్త వెర్షన్‌: అపాచీ 160 సీసీలో త్వరలో అప్‌డేటెడ్‌ వేరియంట్‌ను మార్కెట్‌లోకి తెస్తామని జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుదర్శన్‌ వేణు తెలిపారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement