మోల్డ్‌టెక్‌ మరో 3 ప్లాంట్లు | another three plants in moldtech | Sakshi
Sakshi News home page

మోల్డ్‌టెక్‌ మరో 3 ప్లాంట్లు

Feb 11 2017 12:52 AM | Updated on Sep 5 2017 3:23 AM

మోల్డ్‌టెక్‌ మరో 3 ప్లాంట్లు

మోల్డ్‌టెక్‌ మరో 3 ప్లాంట్లు

ప్యాకేజింగ్‌ రంగంలో ఉన్న మోల్డ్‌టెక్‌ ప్యాకేజింగ్‌ మరో మూడు ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది.

2018లో ఉత్పత్తి కార్యకలాపాలు
రూ.54 కోట్ల దాకా పెట్టుబడి
మూడో త్రైమాసికంలో తగ్గిన నికరలాభం
కంపెనీ సీఎండీ లక్ష్మణరావు  


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్యాకేజింగ్‌ రంగంలో ఉన్న మోల్డ్‌టెక్‌ ప్యాకేజింగ్‌ మరో మూడు ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఏసియన్‌ పెయింట్స్‌ కోసం మైసూరు, వైజాగ్‌లో ప్లాంట్లు రానున్నాయి. స్థల సేకరణ కూడా పూర్తయింది. అలాగే మరో పెయింట్‌ కంపెనీ కోసం దక్షిణాదిన ఒక యూనిట్‌ ఏర్పాటు చేయనుంది. నెల రోజుల్లోగా ఈ కంపెనీతో ఒప్పందం ఖరారు కానున్నట్లు తెలియవచ్చింది. ప్రతిపాదిత మూడు ప్లాంట్లలో 2018 జూన్‌–అక్టోబర్‌ కాలంలో ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఒక్కో యూనిట్లో తొలి దశ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3,500 టన్నులుంటుంది. మూడు ప్లాంట్ల ఏర్పాటుకు మొత్తం రూ.54 కోట్ల దాకా వెచ్చిస్తున్నట్లు మోల్డ్‌టెక్‌ సీఎండీ జె.లక్ష్మణ రావు ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో చెప్పారు.

సామర్థ్యం రెట్టింపు..
నూతన కేంద్రాల సామర్థ్యాన్ని 2021 కల్లా రెట్టింపు చేస్తామని లక్ష్మణరావు తెలిపారు. ఇందుకోసం మరో రూ.27 కోట్ల దాకా ఖర్చవుతుందన్నారు. సంస్థకు ఇప్పటికే ఏడు ప్లాంట్లున్నాయి. ఈ ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 30,000 టన్నులు. ప్రస్తుతం కంపెనీ ఉద్యోగుల సంఖ్య ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,300 దాకా ఉంది. విస్తరణతో మరో 800 మందికి ఉపాధి లభిస్తుందని ఆయన చెప్పారు. ప్యాకేజింగ్‌ సేవలందించేందుకు మరిన్ని ఫుడ్, ఎఫ్‌ఎంసీజీ రంగ కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని, అవి పురోగతిలో ఉన్నాయని వివరించారు.

నికర లాభం రూ.5.5 కోట్లు..
డిసెంబర్‌ త్రైమాసికం స్టాండెలోన్‌ ఫలితాల్లో మోల్డ్‌టెక్‌ ప్యాకేజింగ్‌ నికర లాభం క్రితంతో పోలిస్తే రూ.6 కోట్ల నుంచి రూ.5.5 కోట్లకు వచ్చి చేరింది. ఆదాయం రూ.75.7 కోట్ల నుంచి రూ.76 కోట్లకు ఎగసింది. ఫుడ్, ఎఫ్‌ఎంసీజీ విభాగం ప్రస్తుతం 7 శాతం సమకూరుస్తోంది. వచ్చే ఏడాది ఇది 15–20  శాతానికి చేరుతుందని కంపెనీ భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement