
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను 49 రోజుల వ్యవధి తర్వాత సంపూర్ణంగా తొలగించడం శ్రేయస్కరమని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు. ‘పరిశోధనల ప్రకారం 49 రోజుల లాక్‌డౌన్ సరిపోతుంది. అదే నిజమైతే ఆ తర్వాత దాన్ని సమగ్రంగా ఎత్తివేయొచ్చు‘ అని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
వ్యవస్థలో ప్రతీదీ ఒకదానికి మరొకటి అనుసంధానమై ఉంటోంది కాబట్టి.. లాక్‌డౌన్‌ను క్రమానుగతంగా తొలగిస్తూ పోయిన పక్షంలో పారిశ్రామిక రికవరీ చాలా మందకొడిగా సాగుతుందన్నారు. ఉదాహరణకు తయారీ రంగంలో ఒక్క ఫీడర్ ఫ్యాక్టరీ మూతబడి ఉన్నా.. అంతిమంగా ప్రోడక్ట్ అసెంబ్లీ యూనిట్ పనులన్నీ నిల్చిపోతాయని పేర్కొన్నారు. చదవండి: లాక్‌డౌన్ సమస్యలపై సుప్రీం విచారణ