ప్రభుత్వ నిబంధనలకు అమెజాన్ గండి | Amazon May Violate India’s New Rules on Foreign E-Commerce | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ నిబంధనలకు అమెజాన్ గండి

Published Fri, Apr 8 2016 4:49 PM | Last Updated on Thu, Oct 4 2018 8:09 PM

ప్రభుత్వ నిబంధనలకు అమెజాన్ గండి - Sakshi

ప్రభుత్వ నిబంధనలకు అమెజాన్ గండి

విదేశీ ఈ-కామర్స్ సంస్థలు భారత్ లో ఆన్ లైన్ వ్యాపారం నిర్వహించడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను, ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన అమెజాన్ సంస్థ అతిక్రమిస్తోంది.

చైనా తర్వాత అతిపెద్ద ఆన్ లైన్ షాపింగ్ మార్కెట్ గా భారత్ ఎదుగుతోంది. షాపింగ్ కోసం భారత వినియోగదారులు ఎక్కువగా ఆన్ లైన్ ను ఆశ్రయిస్తున్నారు. అయితే విదేశీ ఈ-కామర్స్ సంస్థలు భారత్ లో ఆన్ లైన్ వ్యాపారం నిర్వహించడానికి మన ప్రభుత్వం కొత్తగా మరికొన్ని నిబంధనలను తీసుకొచ్చింది. ఈ నిబంధనలను ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన అమెజాన్ సంస్థ అసలు పట్టించుకోవడం లేదు.

విదేశీ ఈ-కామర్స్ సంస్థలకు సరియైన ఆదేశాలు ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్లే నిబంధనలను గాలికి వదిలేస్తున్నారని ఫార్రెస్టర్ రీసెర్చ్ సంస్థ విశ్లేషకుడు సతీష్ మీనా తెలిపారు. ఈ నిబంధనలపై సరియైన వివరాలు అందించాలని లేదా సెప్టెంబర్ వరకూ నిబంధనలు అమలుచేయకుండా ఉంటే బాగుంటుందని ఇంటర్నెట్ కంపెనీలకు ప్రతినిధులుగా వ్యవహరిస్తున్న ట్రేడ్ అసోసియేషన్లు అభిప్రాయపడ్డాయి.

మరోవైపు ప్రభుత్వం విధించిన నిబంధనలను విదేశీ ఈ-కామర్స్ సంస్థలు తప్పుబడుతున్నాయి. 2020 నాటికి భారత్ లో ఆన్ లైన్ వ్యాపారంలో 75 బిలియన్ డాలర్లుకు చేరుకుంటుందని అంచనా. ప్రస్తుతం ఈ మార్కెట్ 12.1 బిలియన్ డాలర్లుగా ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement