అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌ | Amazon Great Indian sale | Sakshi
Sakshi News home page

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌

Jan 18 2019 8:55 AM | Updated on Jan 18 2019 11:08 AM

Amazon Great Indian sale - Sakshi

సాక్షి, ముంబై:  ఆన్‌లైన్‌  కొనుగోలు దారులకు  పండగే పండగ.  2019 ఏడాదిలో తొలి డిస్కౌంట్ల సేల్‌  షురూ  అవుతోంది.  దిగ్గజ ఆన్‌లైన్‌ రీటైలర్స్‌ రిపబ్లిక్‌ డే సందర్భంగా ఆఫర్ల వర్షం కురిపించనున్నాయి. ఈ వరుసలో ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్  క్యూ కట్టాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్‌ సేల్‌ను ప్రకటించగా..అమెజాన్‌ జనవరి 20 నుంచి 23 వరకు గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో స్పెషల్‌   విక్రయాలకు తెరతీయనుంది.  ముఖ‍్యంగా ప్రైమ్ మెంబర్లకు ప్రత్యేక డీల్స్  అందుబాటులో ఉంచింది.  ప్రైమ్ సభ్యుల కోసం జనవరి 19 మధ్యాహ్నం 12 గంటల నుంచే ఈ సేల్ మొదలవుతుంది.  పలు క్యాటగిరీల్లో 17 కోట్ల ఉత్పత్తులపై ఆఫర్లున్నాయి. 

వన్‌ప్లస్ 6టీ, శాంసంగ్ గెలాక్సీ, ఐఫోన్స్, హానర్, రియల్‌మీ, షావోమీలాంటి స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు లభిస్తాయి. హెచ్‌‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా జరిపే కొనుగోళళ్లపై 10 శాతం అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. బజాజ్ ఫిన్‌సర్వ్ ఈఎంఐ కార్డు హోల్డర్లకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది. అంతేనా దాదాపు లక్ష రూపాయల దాకా క్రెడిట్ సదుపాయం కూడా  కల్పిస్తుంది. 

వీటితోపాటు ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ అండ్ కిచెన్, నిత్యావసర వస్తువులపై ఆఫర్లు ఉన్నాయి. ఇక అమెజాన్ ఇకో, ఫైర్ టీవీ స్టిక్, కిండిల్ ఇ-రీడర్స్‌పై రూ.3,000 వరకు తగ్గింపు లభిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement