అట్టహాసంగా ఆకాశ్‌, శ్లోకాల మెహందీ ఫంక్షన్‌ | Akash Ambani And Shloka Mehta Mehndi. Priyanka Chopra Shares Photo | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా ఆకాశ్‌, శ్లోకాల మెహందీ ఫంక్షన్‌

Jun 28 2018 8:25 AM | Updated on Jun 28 2018 10:59 AM

Akash Ambani And Shloka Mehta Mehndi. Priyanka Chopra Shares Photo - Sakshi

ముంబై : రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ ఇంట్లో పెళ్లి సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. అంబానీ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, రస్సెల్‌ మెహతా కూతురు శ్లోకా మెహతాల మెహందీ వేడుక ముంబైలోని అంబానీ రెసిడెన్సీలో బుధవారం గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్‌ దిగ్గజాలు, పలువురు ప్రముఖలు హాజరయ్యారు. ఆకాశ్‌, శ్లోకాల మెహందీ వేడుకకు చెందిన ఓ  ఫోటోను బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ వేడుకలో ప్రియాంక ప్రముఖ డిజైనర్‌ తరుణ్‌ తాహిలియాని డిజైన్‌ చేసిన తెలుపు రంగు చీరను కట్టుకుని తళుక్కుమని మెరిసారు. ‘కంగ్రాట్యులేషన్స్‌ ఆకాశ్‌, శ్లోకా! ఈ వేడుకు ఎంత అద్భుతంగా ఉంది. లవ్‌ యూ బోత్‌. ప్రీ, ప్రీ.. ఎంగేజ్‌మెంట్‌ పార్టీ’ అనే క్యాప్షన్‌తో ప్రియాంక ఈ ఫోటోను షేర్‌ చేశారు. త్వరలోనే ప్రియాంక చోప్రా కూడా అమెరికన్‌ సింగర్‌ నిక్‌  జోనాస్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.  

ఆకాశ్‌, శ్లోకాల మెహందీ వేడుకకు చెందిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ వేడుకలో నేవి బ్లూ టాప్‌, హెవీ ఎంబ్రాయిడ్‌తో క్రీమ్‌ లెహంగాలో శ్లోకా ముసిముసి నవ్వులతో మెరిసిపోగా.. ఆకాశ్‌ తెల్లటి కుర్తాతో సింపుల్‌గా కనిపించాడు. గుండ్రటి చెవిదిద్దులు, పింక్‌ లిప్స్‌తో శ్లోకా మెరిసిపోయింది. ప్రియాంకతో పాటు బాలీవుడ్‌ సెలబ్రిటీలు షారుఖ్‌ ఖాన్‌, ఐశ్వర్య రాయ్‌, కత్రినా కైఫ్‌, కరణ్‌ జోహార్‌, కిరణ్‌ రావులు పాల్గొన్నారు. శనివారం వీరి ఎంగేజ్‌మెంట్‌ను అంబానీ ఫ్యామిలీ నిర్వహించబోతుంది. ఈ నిశ్చితార్థపు ఆహ్వానాలను కూడా అంబానీ ఫ్యామిలీ జూన్‌ మొదటి వారంలోనే అందరికీ అందించింది. రెండు నెలల క్రితమే శ్లోకా, ఆకాశ్‌ల పెళ్లి నిశ్చియమైన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి నిశ్చియమైన కొన్ని రోజులకే, అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ పెళ్లి కూడా పిరమాల్‌ గ్రూప్‌ వారసుడు ఆనంద్‌ పిరమాల్‌తో నిశ్చయమైంది. వీరి ఫోటోలు, అంబానీ ఫ్యామిలీ నిర్వహించిన పార్టీల ఫోటోలు అప్పటి నుంచి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉన్నాయి. కాగ, శ్లోకా మెహతా డైమాండ్‌ వ్యాపారి రస్సెల్‌ మెహతా, మోన మెహతాల కూతురు. రోజీ బ్లూ డైమాండ్స్‌ను వీరి కుటుంబం నిర్వహిస్తోంది.


 

1
1/3

2
2/3

3
3/3

Advertisement
 
Advertisement
Advertisement