
న్యూఢిల్లీ : రిలయన్స్ జియోకు టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ రోజుకో షాకిస్తూనే ఉంది. కొత్త కొత్త ఆఫర్లతో జియో నుంచి వస్తున్న పోటీని తీవ్ర స్థాయిలో ఎదుర్కొంటోంది. తాజాగా ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.448తో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. రిలయన్స్ జియో పాపులర్ రూ.399 ప్లాన్‌కు కౌంటర్‌గా ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద వాయిస్ కాల్స్‌ను, రోజు 1జీబీ డేటాను 70 రోజుల పాటు అందించనుంది. అంటే 70 రోజులకు మొత్తం 70జీబీ డేటా ఉచితంగా లభిస్తోంది. వాయిస్ కాల్స్‌లో ఎయిర్‌టెల్ పరిమితి విధించింది. రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 కాల్స్ వాడుకునేలా ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
కస్టమర్ రోజుకు 200 నిమిషాలను వాడుకున్నట్టయితే మొదటి 5 రోజుల తరువాత ఉచిత టాక్‌టైం లభిస్తోంది. ఒకవేళ పరిమితికి మించి టాక్ టైమ్‌ను వాడుకుంటే నిమిషానికి 30 పైసల ఛార్జీలు విధించనున్నట్టు ఎయిర్‌టెల్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ఇక ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ ద్వారా యూజర్లకు ఉచిత రోమింగ్ కూడా అందుబాటులో ఉంటుంది.