
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజ కంపెనీ భారతీ ఎయిర్‌టెల్.. దేశవ్యాప్తంగా వై–ఫై కాలింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు శుక్రవారం ప్రకటించింది. నూతన సేవల ఆధారంగా ఇతర వై–ఫై నెట్‌వర్క్‌లను కూడా వినియోగించుకుని కాల్స్ చేయవచ్చని, దీంతో పాటు ఇళ్లలో లేదా ఆఫీసుల్లో కాల్స్ చేసేటప్పుడు నిరాటంకంగా ఎల్‌టీఈ నుంచి వై–ఫైకి మారవచ్చని వివరించింది.
ఇందుకు కస్టమర్ల నుంచి ఎటువంటి అదనపు చార్జీలను వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. పైలట్ ప్రొజెక్ట్ కింద ఇప్పటికే అందుబాటులో ఉన్న సంస్థ సేవలకు విశేష స్పందన లభించిందని, వై–ఫై కస్టమర్ల సంఖ్య 10 లక్షలను అధిగమించిందని ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఇటీవలే రిలయన్స్ జియో సైతం ఈ తరహా సేవ లను అందుబాటులోకి తెచ్చింది.