
ఎయిర్‌టెల్ (ఫైల్ ఫోటో)
రిలయన్స్ జియోకు కౌంటర్‌గా కొత్త కొత్త ప్లాన్లను లాంచ్ చేస్తున్న టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ మరో సరికొత్త ప్లాన్‌ను తన కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. 65 రూపాయిలతో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. 28 రోజుల పాటు వాలిడిటీలో ఉండే ఈ ప్లాన్ కింద 1జీబీ 2జీ/3జీ డేటాను ఆఫర్ చేస్తుంది. అయితే ఈ ప్లాన్ కేవలం ఎంపిక చేసిన ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే.
మై ఎయిర్‌టెల్ యాప్ ద్వారా ఈ ప్లాన్‌కు యూజర్లు తాము అర్హులో కాదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. టెలికాం సర్కిల్‌ను బట్టి ఈ ప్లాన్ కింద ఎయిర్‌టెల్ కేవలం 2జీ లేదా 3జీ డేటాను మాత్రమే ఆఫర్ చేస్తోంది. అయితే ఎయిర్‌టెల్ 49 రూపాయిలతో డైలీ ప్లాన్‌ను కూడా ఆవిష్కరించింది. దీని కింద ఒక్క రోజు పాటు 1జీబీ 4జీ డేటాను యూజర్లు పొందవచ్చు. 49 రూపాయలతో టారిఫ్ ప్లాన్ కూడా ఉంది. ఈ టారిఫ్ ప్లాన్ కింద 28 రోజుల వాలిడిటీతో 2జీబీ 3జీ/4జీ డేటాను ఆఫర్ చేస్తోంది.
రిలయన్స్ జియోకు కౌంటర్‌గా ఎయిర్‌టెల్ ఇటీవల పలు ప్లాన్లను లాంచ్ చేస్తూ ఉంది. ఇటీవలే వాయిస్‌ఓవర్ ఎల్టీఈ బీటా ప్రొగ్రామ్‌ను కూడా ఎయిర్‌టెల్ ఎంపికచేసిన జోన్లలో లాంచ్ చేసింది. ఈ ప్రొగ్రామ్ కింద ఎంపిక చేసిన యూజర్లకు 30జీబీ వరకు ఉచిత డేటాను అందిస్తోంది. హెచ్‌డీ వాయిస్ కాలింగ్, ఇన్‌స్టాంట్ కాల్ కనెక్ట్, మల్టి టాస్కింగ్ వంటి స్పెషల్ ఫీచర్లను వాయిస్‌ఓవర్ టెక్నాలజీ ఆఫర్ చేస్తోంది. ఈ సర్వీసులు ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, అస్సాం, కేరళ, బిహార్, పంజాబ్‌లలో అందుబాటులో ఉన్నాయి.