ఎయిర్‌టెల్‌ కాంబో ప్యాక్‌లు

Airtel introduces prepaid recharge combo packs for Mumbai circle - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దివాలీ ఆఫర్‌గా టెలికాం కంపెనీలు  కొత్త టారిఫ్‌లను  ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎయిర్‌ టెల్‌  అయిదు కొత్త ప్రీపెయిడ్‌ప్లాన్లను ప్రారంభించింది. జియోకు కౌంటర్‌గా వీటిని  లాంచ్‌ చేసింది. అయితే ప్రస్తుతానికి ముంబై సర్కిల్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి.

రిలయన్స్  జియో  దీపావళి బొనాంజా, బీఎస్‌ఎన్‌ఎల్‌ వార్షిక ప్లాన్‌  ప్రవేశపెట్టిన తర్వాత, ఎయిర్‌టెల్‌ కూడా కస్టమర్లను ఆకర్షించేందుకు ఆసక్తికరమైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్లను ప్రకటించింది. వీటిని కాంబో రీఛార్జ్ ప్యాక్‌లుగా  ప్రవేశపెట్టింది.

రూ .35 ప్లాన్ : వాలిడిటీ 28 రోజులు ఇందులో 26.5 రూపాయల టాక్‌ టైం. 100 ఎంబీ డేటా,
రూ.65 ప్లాన్‌:  వాలిడిటీ 28 రోజులు,  రూ.55  టాక్‌టైం. 200ఎంబీ డేటా
రూ.95ప్లాన్‌:  వాలిడిటీ 28 రోజులు , 95 రూపాయల టాక్‌ టైం. 500 ఎంబీ డేటా
రూ. 145 రీఛార్జి ప్యాక్:  వాలిడిటీ 42 రోజులు, పూర్తి టాక్‌ టైం, 1 జీబీ డేటా
రూ. 245 ప్యాక్ :  రూ. 245 టాక్ టైమ్, 2 జీబీ డేటా,  వాలిడిటీ 84 రోజులు.
 రూ .419 రీఛార్జి ప్యాక్‌:  ఇది కాంబో ఆఫర్‌ కాదు.  75 రోజులు వాలిడిటీ,  రోజుకు 1.4జీబీ డేటా చొప్పున  మొత్తం 105జీబీ ఉచితం.   అన్‌లిమిటెడ్‌ వాయిస్‌కాల్స్‌, రోజుకు 100ఎస్‌ఎంఎస్‌లు.
ఈ ఆఫర్లు  పొందేందుకు, వినియోగదారులు అధికారిక ఎయిర్టెల్ వెబ్‌సైట్‌ను  లేదా  సమీప రిటైల్ అవులెట్‌ను సందర్శించవచ్చు. అలాగే  మై ఎయిర్‌టెల్‌ ఆప్‌ ద్వారా ఈ ఆఫర్లు లభ్యం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top