డిస్నీ+హాట్‌స్టార్ విఐపీ ఫ్రీ: ఎయిర్‌టెల్ కొత్త ప్యాక్

Airte launches prepaid pack with free Disney plus Hotstar VIP subscription - Sakshi

లాక్‌డౌన్ కష్టాల్లో ఎయిర్టెల్ కొత్త ప్యాక్

ఏడాది  డిస్నీ+ హాట్‌స్టార్ విఐపీ చందా ఉచితం

సాక్షి, ముంబై : లాక్‌డౌన్ కష్టాల్లో వున్న  ప్రజల కోసం  మొబైల్ సేవల సంస్థ భారతి ఎయిర్‌టెల్ సరికొత్త డేటా ప్యాక్ తీసుకొచ్చింది.  రూ .401ల ప్రీపెయిడ్ డేటా ప్యాక్‌ను ప్రకటించింది.  కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పూర్తి లాక్‌డౌన్ లో ఉన్న ప్రేక్షకులను లక్ష్యంగా ఎయిర్‌టెల్ ఈ ప్లాన్ తీసుకొచ్చింది. ఇందులో డిస్నీ+ హాట్‌స్టార్  విఐపీ  సబ్ స్ర్కిప్షన్ను సంవత్సరం ఉచితంగా అందిస్తోది. దీంతోపాటు డేటా ప్రయోజనాలను అందిస్తోంది.   రోజుకు 3 జీబీ డేటాను 28 రోజులు అందిస్తుంది. అయితే,  ఇందులో కాలింగ్, ఎస్ఎంఎస్ లాంటి సదుపాయాలువుండవు.  

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే...డిస్నీ + హాట్‌స్టార్ విఐపీ సంవత్సర చందా.రూ .399. అదే ఎయిర్‌టెల్ చందాదారులైతే, కొత్త రూ .401 ప్లాన్‌లో ప్లాన్ ద్వారా రోజుకు 3జీబీ వరకు డేటా ప్రయోజనాలను అదనంగా పొందవచ్చు.  ప్రీపెయిడ్ ప్లాన్ ముగిసి తర్వాత  కూడా ఈ  చందా 365 రోజులు చెల్లుబాటులో వుంటుంది.  రూ .401 ప్రీపెయిడ్ ప్లాన్ పైన ఉన్న ఏ ఇతర ప్లాన్‌తోనైనా వినియోగదారులు తమ నంబర్లను రీఛార్జ్ చేసుకోవచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ ప్లాన్‌ను పొందగలరని పేర్కొంది. (5 సెకన్లలో కరోనా వైర‌స్‌ను గుర్తించవచ్చు!)

అలాగే ఎయిర్‌టెల్‌లో రూ .398 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా ఉంది, ఇది అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తుంది. ఇందులో రోజుకు 3 జీబీ డేటాతో పాటు ఉచిత వాయిస్ కాలింగ్ , ఎస్ఎంఎస్ ప్రయోజనాలు అందిస్తుంది.  అమెజాన్ ప్రైమ్ చందాకు రూ .999 ఖర్చవుతుంది. అంటే ఈ ప్లాన్లో వినియోగదారులు అదనపు ప్రయోజనాలతో  పాటు రూ .398 లకే అమెజాన్ ప్రైమ్ చందాను పొందవచ్చు. (కరోనా ఎఫెక్ట్ : ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంచలనం)

అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ 5, ఆల్ట్ బాలాజీ వంటి స్థానిక స్ట్రీమింగ్ యాప్‌లకు పోటీగా  డిస్నీ+ హాట్ స్టార్ ఇటీవల భారతదేశంలో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. హిందీ, తమిళం, తెలుగు టైటిళ్లను డిస్నీ+ హాట్‌స్టార్ విఐపిలో,  ఇంగ్లీషు టైటిళ్లను డిస్నీ+హాట్‌స్టార్ ప్రీమియం ద్వారా వినియోగదారులకు  ముఖ్యంగా పిల్లలకు  అందుబాటులోకి తీసుకు వచ్చింది. (కరోనా వైరస్ : గ్లెన్‌మార్క్‌ ఔషధం!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top