కొత్త రూట్‌ : డిస్కౌంట్‌ ధరలు | AirAsia India offers discounted fares on new routes | Sakshi
Sakshi News home page

కొత్త రూట్‌ : డిస్కౌంట్‌ ధరలు

Dec 8 2017 3:12 PM | Updated on Aug 14 2018 4:01 PM

AirAsia India offers discounted fares on new routes - Sakshi

బడ్జెట్‌ క్యారియర్‌ ఎయిర్‌ఏసియా కొత్త రూట్లకు డిస్కౌంట్‌లో టిక్కెట్లను అందించనున్నట్టు ప్రకటించింది. 2018 జనవరి 1 నుంచి కొత్త రూట్లకు రూ.1,999కే టిక్కెట్‌ ధరలు ప్రారంభమవుతాయని ఎయిర్‌ఏసియా తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. హైదరాబాద్‌ నుంచి భువనేశ్వర్‌ వరకు రోజూ డైరెక్ట్‌ విమానాలను లాంచ్‌ చేసింది. ఈ కొత్త మార్గానికి అడ్వాన్స్‌గా టిక్కెట్‌ బుక్‌ చేసుకునే వారికి, డిస్కౌంట్‌ ధరలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ కొత్త ఆఫర్‌ కింద డిసెంబర్‌ 10 వరకు టిక్కెట్లను బుక్‌ చేసుకోవచ్చు. కేవలం వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే టిక్కెట్లను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రమోషనల్‌ ధరల కింద ఎన్ని సీట్లు ఆఫర్‌ చేస్తుందో ఎయిర్‌ఏసియా వెల్లడించలేదు. ఈ ఆఫర్‌ ధరలోనే పన్నులు కూడా కలిసి ఉంటాయి.

సీట్లు పరిమితంగానే అందుబాటులో ఉంటాయని, అన్ని విమానాలకు ఈ డిస్కౌంట్‌ ధరలు వర్తించవని మాత్రం ఎయిర్‌ఏసియా తెలిపింది. ఎయిర్‌ఏసియా బుకింగ్స్‌ పోర్టల్‌లో సెర్చ్‌ చేస్తే, కొత్త రూట్‌ హైదరాబాద్‌ టూ భువనేశ్వర్‌, భువనేశ్వర్‌ టూ హైదరాబాద్‌కు 2018 జవనరి 4 నుంచి టిక్కెట్‌ ధరలు రూ.1999గా ఉన్నాయి. టిక్కెట్‌ ధర రూ.1999లోనే 20 కేజీల బ్యాగేజ్‌, ఒకపూట ఆహారం ఉండనుంది. క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో చెల్లింపులు చేస్తే, నాన్‌-రిఫండబుల్‌ ప్రాసెసింగ్‌ ఫీజు అందుబాటులో ఉంటుంది. హాలిడే సీజన్‌ సందర్భంగా ప్రయాణికులను ఆకట్టుకోవడానికి దేశీయ విమానయాన సంస్థలు భారీ ఎత్తున్న డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తున్నాయి. డిస్కౌంట్‌ ధరలు దేశీయ విమానయాన సంస్థలకు మంచి ట్రాఫిక్‌ వృద్ధికి సహకరిస్తాయి.  

Advertisement
 
Advertisement
Advertisement