ఆర్సెలర్‌ ప్రెసిడెంట్‌గా ఆదిత్య మిట్టల్‌ | Aditya Mittal as Arcelor president | Sakshi
Sakshi News home page

ఆర్సెలర్‌ ప్రెసిడెంట్‌గా ఆదిత్య మిట్టల్‌

Mar 6 2018 12:03 AM | Updated on Mar 6 2018 12:03 AM

Aditya Mittal as Arcelor president - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఉక్కు దిగ్గజం ఆర్సెలర్‌ మిట్టల్‌ ప్రెసిడెంట్‌గా ఆదిత్య మిట్టల్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్సెలర్‌ మిట్టల్‌ యూరప్‌ విభాగానికి సీఎఫ్‌వో, సీఈవోగా ఉన్న ఆదిత్యకు తాజాగా ప్రెసిడెంట్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది.

ఆర్సెలర్‌ మిట్టల్‌ చైర్మన్, సీఈవో లక్ష్మీనివాస్‌ మిట్టల్‌ కుమారుడే ఆదిత్య మిట్టల్‌. చైర్మన్‌కి కుడిభుజంగా వ్యవహరిస్తూ.. గ్రూప్‌ కార్యకలాపాల్లో ఆదిత్య వ్యూహాత్మక పాత్ర పోషిస్తున్నారని సంస్థ వివరించింది. ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో ఆర్సెలర్‌ మిట్టల్‌ కార్యకలాపాలు సాగిస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement