ఫాక్స్‌కాన్‌తో అదాని జాయింట్ వెంచర్? | Adani joint venture with Foxconn | Sakshi
Sakshi News home page

ఫాక్స్‌కాన్‌తో అదాని జాయింట్ వెంచర్?

Aug 5 2015 12:27 AM | Updated on Aug 17 2018 2:39 PM

ఫాక్స్‌కాన్‌తో అదాని జాయింట్ వెంచర్? - Sakshi

ఫాక్స్‌కాన్‌తో అదాని జాయింట్ వెంచర్?

అదాని ఎంటర్‌ప్రైజెస్, ప్రపంచ అతిపెద్ద కాంట్రాక్ట్ తయారీదారు ఫాక్స్‌కాన్‌తో కలసి ఒక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయడానికి చర్చలు జరుపుతోంది...

న్యూఢిల్లీ: అదాని ఎంటర్‌ప్రైజెస్, ప్రపంచ అతిపెద్ద కాంట్రాక్ట్ తయారీదారు ఫాక్స్‌కాన్‌తో కలసి ఒక జాయిం ట్ వెంచర్‌ను ఏర్పాటు చేయడానికి చర్చలు జరుపుతోంది. ఈ జాయింట్ వెంచర్ ద్వారా అదాని ఎంటర్‌ప్రైజెస్ భారత్‌లో యాపిల్ ఐఫోన్స్‌ను తయారు చేస్తుందని సమాచారం. కంపెనీ వ్యాపార విస్తరణ కోసం గత నెలలో అదాని షేర్‌హోల్డర్లు సెక్యూరిటీల ఇష్యూ ద్వారా రూ.6,000 కోట్ల నిధుల సమీకరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో కంపెనీ షేరు ధర బీఎస్‌ఈలో 11 శాతం పెరిగి రూ.94 వద్ద ముగిసింది.

Advertisement
 
Advertisement
Advertisement