ఆధార్‌ నిబంధనల  సవరణకు క్యాబినెట్‌ ఓకే.. 

Aadhaar seeding with mobile numbers, bank account - Sakshi

న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాలు, మొబైల్‌ నంబర్లకు ఆధార్‌ను అనుసంధానించడాన్ని చట్టబద్ధం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి టెలిగ్రాఫ్‌ చట్టం, మనీ ల్యాండరింగ్‌ నిరోధక చట్టాలకు సవరణలు చేసే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్‌ సోమవారం ఆమోదముద్ర వేసింది.

ఆధార్‌ ఆధారంగా కొత్త మొబైల్‌ కనెక్షన్స్‌ ఇవ్వడానికి, బ్యాంక్‌ ఖాతాలు తెరవడానికి దీనితో చట్టబద్ధత లభిస్తుంది. వీటికోసం కస్టమర్లు ఆయా సంస్థలకు తమ ఆధార్‌ను ఇష్టపూర్వకంగా ఇవ్వొచ్చు. మొబైల్‌ సిమ్‌ కార్డుల జారీకి, బ్యాంక్‌ ఖాతాలు తెరవడానికి ఆధార్‌ తప్పనిసరన్న సెక్షన్‌ 57ని సుప్రీం కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ప్రైవేట్‌ కంపెనీలు ఆధార్‌ను వినియోగించడంపై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో క్యాబినెట్‌ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top