1947 నెంబర్‌నే వాడుతున్నాం...

Aadhaar Authority UIDAI Responds To Toll-Free Number Controversy - Sakshi

యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏఐ) టోల్‌-ఫ్రీ హెల్ప్‌లైన్‌ నెంబర్‌.. స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల అనుమతి లేకుండా డిఫాల్ట్‌గా కాంటాక్ట్‌ లిస్ట్‌లోకి వచ్చి చేరుతుందనే విషయంపై గందరగోళం నెలకొంది. ఫ్రెంచ్‌ హ్యాకర్‌ ఫ్రెంచ్‌ హ్యాకర్‌ ఇలియట్ ఆల్డెర్సన్ కనుగొన్న ఈ విషయంపై వేల మంది స్మార్ట్‌ఫోన్‌  యూజర్లు స్పందించారు. నిజంగానే తమ ఫోన్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌లోకి యూఐడీఏఐ టోల్‌ఫ్రీ నెంబర్‌ వచ్చి చేరిందని, తమ అనుమతి లేకుండా ఎలా ఈ నెంబర్‌ను యాడ్‌ చేస్తారంటూ మండిపడుతున్నారు. తమ ఫోన్‌లో ఈ నెంబర్‌ సేవ్‌ చేసుకోకుండా.. ఈ నెంబర్‌ వచ్చి చేరడం ఆందోళించదగ్గ విషయమని సీరియస్‌ అవుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల మండిపాటుపై యూఐడీఏఐ స్పందించింది.  మీడియాలో వస్తున్న ఈ రిపోర్టులను యూఐడీఏఐ కొట్టిపారేసింది. 1800-300-1947 అసలు తమ వాలిడ్‌ టోల్‌ఫ్రీ నెంబర్‌ కాదని తేల్చి చెప్పింది. ఆ నెంబర్‌ను వాడటం లేదని పేర్కొంది. ప్రస్తుతం తమ వాలిడ్‌ టోల్‌ఫ్రీ నెంబర్‌ 1947 అని పేర్కొంది. గత రెండేళ్లకు పైగా 1947 నెంబర్‌నే వాడుతున్నట్టు తెలిపింది. 

ప్రజల్లో అనవసరపు గందరగోళం సృష్టిస్తున్నారని పేర్కొంది. ఏ సర్వీసు ప్రొవైడర్‌ను, స్మార్ట్‌ఫోన్‌ తయారీదారిని తమ యూఐడీఏఐ టోల్‌ఫ్రీ నెంబర్‌ యాడ్‌ చేయాలని ఆదేశించలేదని కూడా స్పష్టం చేసింది. యూఐడీఏఐ టోల్‌ఫ్రీ నెంబర్‌ తమ ఫోన్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌లో యాడ్‌ అయిందంటూ ట్విటర్‌ యూజర్లు షేర్‌ చేసిన స్క్రీన్‌ షాట్లలో 1800-300-1947 ఉంది. కానీ ఆ నెంబర్‌ అసలు యూఐడీఏఐ వాడటం లేదని తెలిసిన తర్వాత ఆ నెంబర్‌ ఇన్‌వాలిడ్‌ అని తెలిసింది. కాగ, ‘ ఆధార్‌ నెంబర్‌ అనుసంధానంతో లేదా అనుసంధానం లేకుండా.. వివిధ సర్వీసుల ప్రొవైడర్ల సేవలందుకుంటున్న స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు... ఎంఆధార్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నప్పటికీ లేదా ఇన్‌స్టాల్‌ చేసుకోనప్పటికీ వారి ఫోన్‌ నెంబర్‌ లిస్ట్‌లో డిఫాల్ట్‌గా మీ యూఐడీఏఐ నెంబర్‌ ఉంది. అది కూడా వారి సమ్మతి లేకుండానే. అది ఎలానో వివరించాలి? అంటూ ఇలియట్‌ ఆల్డెర్సన్‌ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top