
స్టాక్ మార్కెట్ లాభాల్లో ట్రేడింగ్‌లో ఎన్‌ఎస్‌ఈ ఓ 4షేర్లు ఏడాది కనిష్టానికి పతనమయ్యాయి. ఆర్తి సర్‌ఫ్యాక్టెంట్స్, బీ.సీ. పవర్ కంట్రోల్స్, మిట్టల్ లైఫ్ స్టైల్, పీవీఆర్ లిమిటెడ్-రైట్స్ ఎంటిల్‌మెంట్ షేర్లు అందులో ఉన్నాయి. మరోవైపు ఇదే ఎక్చ్సేంజ్‌లో 49 షేర్లు ఏడాది గరిష్టాన్ని తాకాయి. 5పైసా క్యాపిటల్ లిమిటెడ్, బాలాజీ టెలీఫిల్మ్స్, సీడీఎస్‌ఎల్, దీపక్ ఫెర్టిలైజర్స్, దిక్సాన్ టెక్నాలజీస్, ఎస్కార్ట్స్, ఎవర్‌రెడీ ఇండియా, హాత్‌వే, హెచ్‌సీఎల్‌టెక్, ఇన్ఫీభీమ్, జేకే సిమెంట్స్, జుబిలెంట్ లైఫ్ సైన్సెస్, మస్టేక్ లిమిటెడ్, ఎంసీఎక్స్, రాలీస్ ఇండియా లిమిటెడ్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్, ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్, సువెన్ ఫార్మాస్యూటికల్స్, విప్రో లిమిటెడ్ షేర్లు అందులో ఉన్నాయి.
కరోనా వ్యాక్సిన్‌పై ఆశలు, ప్రపంచమార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలతో నేడు దేశీయ ఈక్విటీ మార్కెట్ భారీ లాభంతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఒక దశలో సెన్సెక్స్ 560 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 157 పాయింట్లను ఆర్జించింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు సెన్సెక్స్ 452 పాయింట్ల లాభంతో 37889 వద్ద, నిఫ్టీ 130 పాయింట్ల లాభంతో 11152 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంకింగ్, మీడియా, ఆటో, ఫైనాన్స్, రియల్టీ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఫార్మా, మెటల్, ఎఫ్‌ఎంజీసీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి.