జేఎల్‌ఆర్‌ నుంచి కొత్త రేంజ్‌ రోవర్‌ | 2017 Land Rover Range Rover Evoque Launched In India | Sakshi
Sakshi News home page

జేఎల్‌ఆర్‌ నుంచి కొత్త రేంజ్‌ రోవర్‌

Dec 21 2016 12:28 AM | Updated on Sep 4 2017 11:12 PM

జేఎల్‌ఆర్‌ నుంచి కొత్త రేంజ్‌ రోవర్‌

జేఎల్‌ఆర్‌ నుంచి కొత్త రేంజ్‌ రోవర్‌

టాటా మోటార్స్‌ అనుబంధ కంపెనీ ‘జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌’ తాజాగా కొత్త ఏడాది కోసం కొత్తమోడల్‌ను ఆవిష్కరించింది.

ప్రారంభ ధర రూ.49.1 లక్షలు
న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ అనుబంధ కంపెనీ ‘జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌’ తాజాగా కొత్త ఏడాది కోసం కొత్తమోడల్‌ను ఆవిష్కరించింది. ఇది తన పాపులర్‌ ఎస్‌యూవీ రేంజ్‌ రోవర్‌ ఇవోక్‌లో 2017 మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.49.1 లక్షల నుంచి రూ.67.9 లక్షల (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ) శ్రేణిలో ఉంది. ఇది ఆరు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ఇది వరకు మోడళ్లతో పోలిస్తే తాజా కొత్త వాహనంలో కంపెనీ కొన్ని మార్పులు చేసింది.

ఇందులో ప్రధానమైనది 2.0 లీటర్‌ ఇంజీనియమ్‌ డీజిల్‌ ఇంజిన్‌ను అమర్చడం. కంపెనీ నుంచి వచ్చిన ఇదివరకు ఇంజిన్లతో పోలిస్తే దీనిబరువు 20 కేజీలు తక్కువ. ల్యాండ్‌ రోవర్‌ నుంచి వచ్చిన కొత్త ఇంజిన్‌ ఇది. ఇక కొత్త రేంజ్‌ రోవర్‌ ఇవోక్‌లోని అదిరిపోయే డిజైన్, టాప్‌క్లాస్‌ టెక్నాలజీ, లగ్జరీ ఫీచర్లు కస్టమర్లను కట్టిపడేస్తాయని కంపెనీ పేర్కొంది. ఆల్‌ ఫోర్‌ వీల్‌ డ్రైవ్, 9 స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్, ఎల్‌ఈడీ డేటైమ్‌ రన్నింగ్‌ లైట్స్, ఇన్‌కంట్రోల్‌ టచ్‌ ప్రొ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement