10 నుంచి అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌’  | 10 from the Amazon the Great Indian Festival | Sakshi
Sakshi News home page

10 నుంచి అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌’ 

Oct 6 2018 1:34 AM | Updated on Oct 6 2018 1:34 AM

10 from the Amazon the Great Indian Festival  - Sakshi

దసరా సందర్భంగా ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌... ‘గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌’ పేరుతో భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈనెల 10 నుంచి 15 వరకు జరిగే సేల్‌లో 4 లక్షల మంది అమ్మకందారులు తమ ఉత్పత్తులను అందించనున్నారని వెల్లడించింది. ప్రైమ్‌ మెంబర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తూ... వీరికి ప్రత్యేకంగా 9న మధ్యాహ్నం 12 గంటలకు సేల్‌ ప్రారంభం కానుంది.

ప్రైమ్‌ సభ్యులు కానివారికి మాత్రం 10వ తేదీన సేల్‌ ఆరంభమవుతుంది. అదే రోజు డెలివరీ, అమేజాన్‌ పే ఈఎంఐ ద్వారా జీరో– కాస్ట్‌ సౌకర్యం, క్యాష్‌ ఆన్‌ డెలివరీ, ఉదయం వేళ డెలివరీ వంటి అనేక వెసులుబాట్లు కల్పిస్తూ ఫెస్టివల్‌ ప్రారంభం కానుందని అమెజాన్‌ తెలియజేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement