సమస్యల నిలయం.. బాబుక్యాంపు

drainage problems in kothagudem babucamp - Sakshi

అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం

డ్రెయినేజీలు లేక రోడ్లపైకి మురుగు

ప్రమాదభరితంగా  సంపులు 

కొత్తగూడెం (అర్బన్‌) : పట్టణంలోని బాబుక్యాంపు ఏరియాలో సమస్యలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎన్నిసార్లు  అధికారులకు ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకోవడం స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాబుక్యాంపులో ఇటీవల జరిగిన రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఇరువైపులా డ్రెయినేజీల నిర్మాణం చేపట్టారు. అందులో భాగంగా రోడ్డు తవ్వకాలలో వెలువడిన మట్టి డ్రెయినేజీలలో పూడుకుపోయి మురికి నీరు ముందుకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. డ్రెయినేజీలలో మురికి నీరు నిండిపోయి  దుర్వాసన వెదజల్లుతోంది.

స్థానికులు  చెత్తచెదారం  రోడ్డుపై, డ్రైనేజీలలో వేయడం వలన మురికి నీరు ముందుకు వెళ్లే అవకాశం లేదు. దీని వలన దోమలు, ఈగలు వ్యాప్తి చెందుతున్నాయని పేర్కొం టున్నారు. డ్రైనేజీలో పేరుకపోయిన మట్టి, చెత్తను తొలగించి మురికి నీరు ముందుకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. బాబుక్యాంపు  పరిధిలోని చెమన్‌బస్తీ, బర్మాక్యాంపు ఏరియాలలో డ్రైనేజీలు లేక రోడ్లపైనే మురికి నీరు పారుతుంది.   

ప్రమాదభరితంగా సంపులు 
బాబుక్యాంపు ఏరియాలోని కొన్ని విధుల్లో మ్యాన్‌ హోల్స్‌ ప్రమాదభరితంగా ఉండడం వలన  ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో తెలియని వారు అందులో పడి గాయాలపాలవుతున్నారు. సం పుపై మూతలు ఏర్పాటు చేయాలని  సంబంధిత అధికారులు, సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సంపుపై మూతను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగుపర్చాలి  
బర్మాక్యాంపు, చమన్‌బస్తీ  ఏరియాల్లో పారిశుద్ధ్య వ్యవస్థను  మెరుగు పర్చాలి. కొన్ని చోట్ల డ్రైనేజీలు లేకపోవడం వలన రోడ్లపై మురికి నీరు పారుతుంది.  
– అనసూర్య, బాబుక్యాంపు

సంపులపై మూతలు ఏర్పాటు చేయాలి 
సింగరేణి పంపులకు సంబంధించిన సంపులు రోడ్ల వెంబడి ఉన్నాయి. వాటిపై మూతలు లేకపోవడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయి.  చిన్నపిల్లలు పడితే ప్రాణనష్టం  జరిగే అవకాశముంది. 
– సరిత, బాబుక్యాంపు 

Read latest Bhadradri News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top