గ్రహం అనుగ్రహం (24-08-2019)

Daily Rasi Phalalu in Telugu (24-08-2019) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి బ.నవమి రా.2.54 వరకు,తదుపరి దశమి నక్షత్రం రోహిణి రా.12.25 వరకు, తదుపరి మృగశిరవర్జ్యం సా.4.17 నుంచి 5.55 వరకు, దుర్ముహూర్తం ఉ.5.46 నుంచి 7.28 వరకు,అమృతఘడియలు...రా.9.09 నుంచి 10.46 వరకు.

సూర్యోదయం :    5.47
సూర్యాస్తమయం    :  6.18
రాహుకాలం : ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

భవిష్యం
మేషం: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. ఆర్థికంగా ఇబ్బందులు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో అనుకోని మార్పులు.

వృషభం:కొత్త పనులు ప్రారంభిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి.  ప్రముఖుల నుం చి కీలక సందేశాలు. ధనలబ్ధి.  వ్యాపారాలలో ముందగుడుగు వేస్తారు. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు.

మిథునం: పనుల్లో  తొందరపాటు. బంధుగణంతో వివాదాలు. శ్రమ విపరీతంగా పెరుగుతుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. ధనవ్యయం. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగాలలో ఒత్తిడులు.

కర్కాటకం: ఆర్థికాభివృద్ధి. ఆలోచనలు అమలు చేస్తారు. కాంట్రాక్టులు పొందుతారు. ఆస్తిలాభం. వ్యాపారాల విస్తరణ యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

సింహం: పనులు విజయవంతంగా సా గుతాయి. ఆకస్మిక ధనలబ్ధి. సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. వ స్తులాభాలు. గృహయోగం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

కన్య: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో లాభాలు కష్టమే. ఉద్యోగాలలో పనిభారం.

తుల: పనుల్లో ప్రతిబంధకాలు. ఆరోగ్యభంగం. ప్రయాణాలలో అవాంతరాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.

వృశ్చికం: ఆకస్మిక ధనలాభాలు. బంధువుల కలయిక. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా గడుస్తుంది.

ధనుస్సు: కొత్త వ్యక్తుల పరిచయం. వాహనయోగం.  శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతి సూచనలు.

మకరం: ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా. ముఖ్యమైన పనులలో జాప్యం. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగాలలో  పనిభారం.

కుంభం: అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబ సభ్యులతో విభేదాలు. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

మీనం: పనుల్లో  విజయం సాధిస్తారు.  ఆస్తి వివాదాల పరిష్కారం.శుభకార్యాల ప్రస్తావన. భూములు, గృహం కొంటా రు. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top