గ్రహం అనుగ్రహం (19-02-2020) | Daily Horoscope in Telugu(19-02-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (19-02-2020)

Feb 19 2020 6:20 AM | Updated on Feb 19 2020 6:42 AM

Daily Horoscope in Telugu(19-02-2020) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువుమాఘ మాసం, తిథి బ.ఏకాదశి సా.5.16 వరకు, తదుపరి ద్వాదశి నక్షత్రం మూల ఉ.8.44 వరకు, తదుపరి పూర్వాషాఢవర్జ్యం సా.6.25 నుంచి 8.02 వరకు, దుర్ముహూర్తం ప.11.51 నుంచి 12.35 వరకు, అమృతఘడియలు..తె.4.10 నుంచి 5.45 వరకు.

సూర్యోదయం :  6.29
సూర్యాస్తమయం :  5.59
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

భవిష్యం
మేషం: పనుల్లో జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృషభం: వ్యవహారాలు నత్తనడనకసాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. విద్యావకాశాలు నిరాశ పరుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మిథునం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష ఆదరణ. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. భూములు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

కర్కాటకం: శ్రమ పెరిగినా ఫలితం కనిపిస్తుంది. వ్యవహారాలలో విజయం. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింతపురోగతి.

సింహం: పనుల్లో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు అధికమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

కన్య: ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

తుల: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో సఖ్యత. విందువినోదాలు. పనుల్లో విజయం. నూతన ఉద్యోగప్రాప్తి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

వృశ్చికం: మిత్రులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. విచిత్ర సంఘటనలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.

ధనుస్సు: నూతన ఉద్యోగలాభం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి.ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు.

మకరం:  కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ఆరోగ్యభంగం.విద్యార్థులకు శ్రమాధిక్యం.వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.ధనవ్యయం.

కుంభం: పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం.శుభకార్యాలు నిర్వహిస్తారు.కాంట్రాక్టులు దక్కించుకుంటారు.వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మీనం: ఇంటర్వ్యూలుఅందుతాయి. ఆర్థికపరిస్థితిమెరుగ్గాఉంటుంది. సన్నిహితులతోసఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలులాభసాటిగాఉంటాయి. ఉద్యోగాలలోపురోభివృద్ధి. –సింహంభట్ల సుబ్బారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement