గ్రహం అనుగ్రహం (20-07-2020) | Daily Horoscope in Telugu (20-07-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (20-07-2020)

Jul 20 2020 5:38 AM | Updated on Jul 20 2020 5:38 AM

Daily Horoscope in Telugu (20-07-2020) - Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం. దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు. ఆషాఢ మాసం. తిథి అమావాస్య రా.10.44 వరకు, తదుపరి శ్రావణ శు.పాడ్యమి. నక్షత్రం పునర్వసు రా.9.54 వరకు, తదుపరి పుష్యమి. వర్జ్యం ఉ.9.44 నుంచి 11.21 వరకు. దుర్ముహూర్తం ప.12.30 నుంచి 1.22 వరకు, తదుపరి ప.3.06 నుంచి 3.56 వరకు. అమృత ఘడియలు రా.7.25 నుంచి 9.03 వరకు) సూర్యోదయం: 5.38 సూర్యాస్తమయం: 6.31; రాహుకాలం:  ఉ.7.30 నుంచి  9.00 వరకు. యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

గ్రహఫలం
మేషం....శుభకార్యాలపై చర్చలు. చిన్ననాటి మిత్రులతో వివాదాలు తీరతాయి. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు. ఆలయాలు దర్శించుకుంటారు. వ్యాపారులకు స్వల్ప లాభాలు. ఉద్యోగుల పనిభారం కొంత తగ్గే సూచనలు.

వృషభం...బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. ముఖ్య పనుల్లో కొంత అనుకూలం. ధనవ్యయం. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో మరింత ఒత్తిడులు.

మిథునం...సన్నిహితులు, మిత్రుల సాయం పొందుతారు. ఆస్తి విషయాలలో సమస్యలు తీరతాయి. ఆకస్మిక ధనలాభం. వాహన, కుటుంబసౌఖ్యం. వ్యాపారాలలో మరింత సానుకూలం. ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.

కర్కాటకం...ఆరోగ్య, కుటుంబసమస్యలు. వ్యాపారాలలో  కష్టించినా ఫలితం ఉండదు. ఉద్యోగాలలో అవిశ్రాంతంగా పనిచేయాల్సి వస్తుంది.  కొన్ని పనులు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా.

సింహం...ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. ఆలయ దర్శనాలు. ధనలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అరుదైన అవకాశాలు.

కన్య.....రెండుమూడు విధాలుగా ధనలాభం. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.

తుల...కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలలో సమస్యలు పెరుగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు ఎదుర్కొంటారు. విద్యార్థులు మరింత శ్రమపడాలి.

వృశ్చికం...బంధువులతో అకారణంగా వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ముఖ్య పనుల్లో అవాంతరాలు. ధనవ్యయం. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో నిరాశ.

ధనుస్సు..ఆకస్మిక ధనలాభం. ఊహలు నిజమవుతాయి. మిత్రుల నుంచి శుభవర్తమానాలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. భూవివాదాలు తీరతాయి. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు

మకరం...సన్నిహితులతో విభేదాల పరిష్కారం.  రాబడి కొంత పెరుగుతుంది. వాహనాలు, భూములు కొంటారు. ప్రముఖులతో  చర్చలు సఫలం. ఆలయాలు సందర్శిస్తారు.  వ్యాపారాలలో లాభాలు దక్కేఅవకాశం. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

కుంభం...ఆకస్మిక ప్రయాణాలు. సోదరులు, మిత్రులతో  విభేదాలు. అనారోగ్యం. ఆర్థిక ఇబ్బందులు. శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు.  వ్యాపారాలు నిరాశాజనకం. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

మీనం..ప్రయాణాల్లో మార్పులు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువులు, మిత్రుల నుంచి విమర్శలు. ధనవ్యయం. వ్యాపారాలలో  స్వల్ప లాభాలు ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement