గ్రహం అనుగ్రహం (20-04-2020)

Daily Horoscope in Telugu (20-04-2020) - Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం. ఉత్తరాయణం, వసంత ఋతువు. చైత్ర మాసం. తిథి బ.త్రయోదశి రా.3.02 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం పూర్వాభాద్ర ఉ.7.44 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర. వర్జ్యం సా.6.19 నుంచి 8.05 వరకు. దుర్ముహూర్తం ప.12.22 నుంచి 1.12 వరకు, తదుపరి ప.2.53 నుంచి 3.44 వరకు. అమృత ఘడియలు తె.4.35 నుంచి 5.55 వరకు (తెల్లవారితే మంగళవారం)
సూర్యోదయం: 5.45 సూర్యాస్తమయం: 6.12; రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు. యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

భవిష్యం
మేషం: వ్యయప్రయాసలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. బం«ధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

వృషభం: సన్నిహితులతో సఖ్యత. బంధువుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

మిథునం: ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

కర్కాటకం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బం«ధువులు, మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

సింహం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

తుల: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆర్థికంగా బలపడతారు. స్థిరాస్తి వృద్ధి. నిర్ణయాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

వృశ్చికం: పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువర్గంతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

ధనుస్సు: చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మకరం: కుటుంబంలో ఉత్సాహంగా గడుస్తుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

కుంభం: సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. ప్రయాణాలు వాయిదా . వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.

మీనం: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతారు. వ్యవహారాలలో విజయం. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమర్థత నిరూపించుకుంటారు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top