గ్రహం అనుగ్రహం (14-06-2020) | Daily Horoscope in Telugu (14-06-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (14-06-2020)

Jun 14 2020 6:44 AM | Updated on Jun 14 2020 12:30 PM

Daily Horoscope in Telugu (14-06-2020) - Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం తిథి బ.నవమి రా.3.05 వరకు తదుపరి దశమి నక్షత్రం ఉత్తరాభాద్ర రా.12.43 వరకు తదుపరి రేవతి వర్జ్యం ఉ.8.53 నుంచి 9.33 వరకు దుర్ముహూర్తం సా.4.45 నుంచి 5.37 వరకు అమృతఘడియలు..రా.7.30 నుంచి 9.34 వరకు

రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు
సూర్యోదయం 5.29
సూర్యాస్తమయం 6.31
 
గ్రహఫలం...ఆదివారం, 14.06.20

మేషం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి .ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మిథునం: ఆస్తుల విషయంలో ఒప్పందాలు. ఆర్థిక ప్రగతి సా«ధిస్తారు. ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సానుకూలం.

కర్కాటకం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశాజనకం.

సింహం: కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాల సందర్శనం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

కన్య: రుణబాధలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

తుల: కొత్త విషయాలు గ్రహిస్తారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిచయాలు పెరుగుతాయి. వస్తులాభాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సంతృప్తికరంగా ఉంటాయి.

వృశ్చికం: పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు.

ధనుస్సు: ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. సోదరులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు.

మకరం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గొరవం. ఆస్తిలాభం. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

కుంభం: మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనుకోని ఖర్చులు. అనారోగ్యం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో నిరాశ.

మీనం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. సోదరులతో సఖ్యత. ఆరోగ్యం కుదుటపడుతుంది. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. 

Advertisement
 
Advertisement
Advertisement