గ్రహం అనుగ్రహం (10-03-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (10-03-2020)

Published Tue, Mar 10 2020 6:25 AM

Daily Horoscope in Telugu (10-03-2020) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువుఫాల్గుణ మాసం, తిథి బ.పాడ్యమి రా.9.41 వరకు, తదుపరివిదియ, నక్షత్రం ఉత్తర రా.12.29 వరకు, తదుపరి హస్త, వర్జ్యం ఉ.8.49 నుంచి 10.20 వరకు, దుర్ముహూర్తం ఉ.8.32 నుంచి 9.20 వరకు, తదుపరి రా.10.54 నుంచి 11.44 వరకుఅమృతఘడియలు... సా.5.45 నుంచి 7.12 వరకు.

సూర్యోదయం :    6.17
సూర్యాస్తమయం    :  6.04
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

భవిష్యం
మేషం: ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ప్రత్యేక పేరుప్రతిష్ఠలు పొందుతారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత. సన్మానాలు.

వృషభం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మిథునం: పరిస్థితులు అనుకూలించవు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. అనారోగ్యం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.

కర్కాటకం: కొత్తవ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

సింహం: కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని ఒత్తిడులు.

కన్య: నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

తుల: వ్యవహారాలలో ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో అకారణంగా వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప ఇబ్బందులు.

వృశ్చికం: పరిస్థితులు అనుకూలిస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

ధనుస్సు: నిరుద్యోగులకు ఉద్యోగయోగం. పరిచయాలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ప్రగతి.

మకరం: కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు వాయిదా వేస్తారు. శ్రమ పెరుగుతుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

కుంభం: వ్యవహారాలలో అవాంతరాలు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. బంధువర్గంతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

మీనం: పనులలో స్వల్ప ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.– సింహంభట్ల సుబ్బారావు

Advertisement
Advertisement